
విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’తో ఎంత సందడి చేశాడో అందరికీ తెలిసిందే. విజయ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’ టాలీవుడ్‌లో దూసుకెళ్తోంది. వసూళ్లలో ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే దాదాపు 40కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. చూస్తుంటే ఈ మూవీ హవా ఇప్పట్లో తగ్గేలా లేదు.
ఈ మూవీని వీక్షించిన సినీ ప్రముఖుల రాజమౌళి, చిరంజీవి, మహేష్ బాబు, రామ్‌చరణ్ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇప్పుడు తాజాగా టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఈ చిత్రం బృందాన్ని అభినందించారు. మంచి కుటుంబ కథాచిత్రాన్ని అందించినందుకు దర్శకుడు పరశురామ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా రికార్డులు సృష్టిస్తోంది. అర్జున్ రెడ్డి వసూళ్లను అధిగమించి.. రెండు మిలియన్ డాలర్లకు పరిగెడుతోంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ రన్‌తో ఈ సినిమా నడుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జోడిగా నటించిన ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందించగా.. పరశురామ్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment