ఆ రోజు క్లాసు ఎగ్గొటకపోతే బాగుండేది | Special chit chat with vijay devarakonda | Sakshi
Sakshi News home page

ఆ రోజు క్లాసు ఎగ్గొటకపోతే బాగుండేది

Published Wed, Aug 15 2018 1:24 AM | Last Updated on Sat, Aug 3 2019 12:30 PM

Special chit chat with vijay devarakonda - Sakshi

‘‘నాకెవరైనా ఇది చెయ్యొద్దు.. అది చెయ్యొద్దు అంటే అస్సలు వినను. మా అమ్మా నాన్న చెప్తేనే వినను. వేరేవాళ్లు చెబితే ఎందుకు వింటాను. నేనెవర్నీ జడ్జ్‌ చెయ్యను. నన్నెవరైనా జడ్జ్‌ చేస్తే ఊరుకోను. విమర్శలు మాత్రం ఇష్టంగానే స్వీకరిస్తాను. వాటిని గౌరవిస్తాను. నేను చిన్నప్పటినుండి కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌ టైపే. తెలిసి నేను తప్పు చేస్తే.. తెలిసే చేశాం కదా అని సర్దుకుపోతాను’’ అని విజయ్‌ దేవరకొండ అన్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన చిత్రం ‘గీత గోవిందం’. విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ చెప్పిన విశేషాలు...

కేబీఆర్‌ పార్క్‌ వైపు వస్తూ, నా పోస్టర్స్‌ చూసి, ‘ఇది నేనేనా’ అనిపించింది. ‘పెళ్ళి చూపులు’ తర్వాత తెలియకుండానే చాలా బిజీ అయ్యాను. ఆలోచించటానికి కూడా టైమ్‌ లేనంతగా పనిచేస్తున్నా. అయితే హెల్త్‌ పాడైపోయేలా పనిచేయకూడదు అనుకుంటున్నాను. ఈ బిజీ అయిపోగానే ఓ వారం రోజులు నిద్రపోతా ∙నేను చిన్నప్పుడు ఏదైనా బ్రాండ్‌ పెట్టి బిజినెస్‌ చేయాలనుకునేవాడిని. ఏడో తరగతి చదివేటప్పుడే ఇలాంటి అలోచనలు ఉండేవి. అప్పుడు నేను బట్టల కంపెనీ పెట్టాలనుకున్నా. దానికి ‘లావా’ (ఫీల్‌ ద హీట్‌) అనే పేరు కూడా పెట్టాను (నవ్వుతూ) ∙‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు ‘గీత గోవిందం’కు ఒకే ఒక్క విషయం కామన్‌గా ఉంటుంది. అదేంటంటే తను ప్రేమించిన అమ్మాయి కోసం ఆ సినిమాలో అయినా ఈ సినిమాలో అయినా హీరో ఏం చెయ్యటానికైనా సిద్ధమే  ∙ఈ సినిమాలో పాట పాడటానికి కొత్తవారిని ఎంకరేజ్‌ చేసే ప్రాసెస్‌లో వాళ్ల వాయిస్‌లను పంపమని అడిగాం. చాలామంది పంపారు. నాకు పర్సనల్‌గా ఓ రెండు వాయిస్‌లు నచ్చాయి. కానీ అరవింద్‌గారికి సచ్చలేదు. గోపిసుందర్‌ గారు కేరళ నుండి ట్రాక్‌ పంపితే ఓ పాట పాడాను. బాగానే పాడానని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నేను పాడిన ‘వాట్‌ ద లైఫ్‌’ బేసిక్‌ ట్యూన్‌ కాబట్టి లాగించేశాను. అంతేకానీ ‘ఇంకేం ఇంకేం కావాలి’ అనే పాట పాడాలంటే మినిమమ్‌ ఆరు నెలలు ప్రాక్టీస్‌ చెయ్యాలి ∙చిన్నప్పుడు ఒకటో తరగతిలో ‘సరిగమప’ అని పాడమంటే  పాడాను. ఓ వారం రోజులు సంగీతం క్లాస్‌లో కూర్చోపెట్టారు. నాకు గేమ్స్‌ అంటే ఇష్టం ఉండటంతో ఆ క్లాస్‌ జంప్‌ కొట్టి గేమ్స్‌కు జారుకున్నాను.

ఇప్పుడు అనిపిస్తోంది.. ఆ రోజు క్లాస్‌కు వెళితే బాగుండేదని ∙ ‘గీత గోవిందం’ స్క్రిప్ట్‌ను రెండుసార్లు విన్నాను. ఫుల్‌గా నవ్వాను. సినిమా మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. నేను పర్సనల్‌గా త్రివిక్రమ్‌ గారి ‘నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి లాంటి సినిమాలను ఎంజాయ్‌ చేస్తాను. ఈ సినిమా విషయానికొస్తే మేం ఎడిటింగ్‌ రూమ్‌లో సినిమాను ఎడిట్‌ చేస్తున్నాం. డైరెక్టర్‌ పరశురామ్‌ గారబ్బాయికి ఆరేళ్లు ఉంటాయి. అరవింద్‌గారు, మా నాన్న ఉన్నారు. నేను, ‘బన్నీ’ వాసు, మా తమ్ముడు.. ఇలా మూడు జనరేషన్స్‌కి సంబంధించిన వాళ్లందరం ఓ చోట ఉంటే, సినిమాను అన్ని జనరేషన్స్‌ వారు ఎంజాయ్‌ చేయటం గమనించాను. నాకు అది చాలా నచ్చింది ∙ఇప్పుడు నేను ఓ ఫేజ్‌లో ఉన్నాను. ఇది పర్మినెంట్‌ కాదని నాకు తెలుసు. కానీ ఈ ఫాలోయింగ్‌ వలన ఏదైనా చెప్తే ఈజీగా ప్రజల్లోకి వెళ్తుందని మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. నా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా ‘గీత గోవిందం’ని ఎందుకు ముందు విడుదల చేస్తున్నామంటే ఇందులో సీజీ పార్ట్‌ తక్కువ. ‘టాక్సీవాలా’లో సీజీకి ఎక్కువ స్కోప్‌ ఉండటం వల్ల తర్వాత విడుదల చేద్దాం అనుకున్నాం. త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం ∙సినిమా ఫుటేజ్‌ లీకుల గురించి మాట్లాడుతూ ‘‘లైఫ్‌లో డ్రామా ఉండాలి. ఇప్పుడు జరిగింది అదే. అంతా ప్రశాంతంగా ఉంటే మజా ఏముంటుంది’’ అన్నారు. మీ తమ్ముడు హీరోగా రెడీ అవుతున్నారా? అనడిగితే  – ‘‘నాకా విషయాలు తెలియవు. నేను ఎన్ని కష్టాలు పడ్డానో వాడికి తెలియాలిగా’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement