Ranbir Kapoor 'Animal' Movie First Look from Sandeep Reddy Vanga - Sakshi
Sakshi News home page

Animal Movie First Look: వైల్డ్‌లుక్‌లో రణ్‌బీర్‌... ఆసక్తిగా యానిమల్‌ ఫస్ట్‌లుక్‌

Published Mon, Jan 2 2023 10:51 AM | Last Updated on Mon, Jan 2 2023 12:29 PM

Sandeep Reddy Vanga, Ranbir Kapoor Animal Movie First Look Out - Sakshi

‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్‌ సందీప్‌ వంగ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్‌. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే కబీర్‌ సింగ్‌ చిత్రంతో బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. దీంతో సందీప్‌ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్‌ కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. టైటిల్‌ తగ్గట్టే ఫస్ట్‌లుక్‌ వైల్డ్‌ మలిచారు.  

ఈ పోస్టర్‌లో రణ్‌బీర్‌ ఒత్తయిన జట్టు, గుబురు గడ్డం, శరీర మొత్తం రక్తంతో తడిచి సిగరెట్ కాల్చుతూ కనిపించాడు. అర్జున్ రెడ్డి పోలిక కనిపిస్తున్నప్పటికీ చాక్లెట్ బాయ్ లాంటి రణ్‌బీర్‌ను వైల్డ్‌గా చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు సందీప్‌ వంగ. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement