మాధవన్‌ అవుట్‌.. సోనూసూద్‌ ఇన్‌ | Sonu Sood Replaces Madhavan for Simmba | Sakshi
Sakshi News home page

మాధవన్‌ అవుట్‌.. సోనూసూద్‌ ఇన్‌

Published Tue, Mar 27 2018 6:06 PM | Last Updated on Tue, Mar 27 2018 8:23 PM

Sonu Sood Replaces Madhavan for Simmba - Sakshi

సాక్షి, ముంబై : రణవీర్‌సింగ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న టెంపర్‌ రీమేక్‌ ‘ సింబా’ కోసం మరో నటుడి ఎంపిక పూర్తయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విలన్‌ పాత్రలతో గుర్తింపు పొందిన సోనూసూద్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ‘ నేను  సింబాలో పోషించబోయే పాత్ర గురించి చెప్పను. కానీ అదొ ఛాలెజింగ్‌ రోల్‌. నా గత చిత్రాల కంటే విభిన్నంగా ఆ పాత్ర ఉంటుంది. సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఆ పాత్ర గురించే మాట్లాడుకుంటారు’ అని సోనూసూద్‌ ప్రకటించారు.

కాగా, మొదటగా ఈ పాత్ర కోసం తమిళ నటుడు మాధవన్‌ను ఎంపిక చేశారు. అయితే భుజానికి గాయం కావటంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా.. ఆ అవకాశం సోనూసూద్‌కు దక్కింది. రోహిత్‌ శెట్టి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సింబా ను కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌ సరసన కథానాయికగా సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా నటించనుంది.  మే నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుకానుంది. 

పద్మావత్‌ సక్సెస్‌తో జోరుమీదున్న రణ్‌వీర్‌సింగ్‌, మాస్‌ మసాలా చిత్రాలకు పెట్టింది పేరైన రోహిత్‌ శెట్టి,  భారీ స్థాయి సినిమాలను నిర్మించే కరణ్‌ జోహర్‌.. ఈ ముగ్గురి కలయికలో వస్తున్న ‘ సింబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement