మేకప్ ఖర్చు కోటి పైనే...
ఓ 60, 70 ఉంటుందనుకుంటున్నారా...అయితే ఈ ఫొటో చూడండి. బట్టతలతో, కళ్ల జోడుతో, ముడుతలు పడిన మొహంతో కనిపిస్తున్న రిషికపూర్‌ను లుక్ చూసే కాకుండా దాని కోసం అయిన ఖర్చు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. షకున్ బాత్రా దర్శకత్వంలో కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్థార్థ్ రాయ్ మల్హోత్రా, ఆలియాభట్ జంటగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న రిషికపూర్ మేకప్ కోసమే దర్శకనిర్మాతలు రూ. 1.5 కోట్లు నుంచి 1.75 రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలు ‘ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమన్ బుట్టో’, ‘డ్రాకులా’ చిత్రాలకు మేకప్‌మ్యాన్‌గా పనిచేసిన గ్రెగ్ కానమ్ రిషికపూర్ కొత్త లుక్‌కు రూపం ఇచ్చారు.
దీని గురించి రిషికపూర్ మాట్లాడుతూ- ‘‘ప్రతి రోజూ ఐదు గంటల పాటు ఈ మేకప్ కోసం కేటాయించాల్సి వచ్చేది. కరణ్, షకున్‌లు ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు కాస్త సందేహించాను. ఖర్చు కూడా ఎక్కువే. కానీ వాళ్లు మాత్రం వెనుకాడలేదు. నాకైతే మేకప్ కోసం అంత సేపు కష్టమనిపించింది. కానీ మేకప్ వేసుకున్నాక మాత్రం నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను’’ అని చెప్పారు.