సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు ఆకట్టుకున్నాయి. పంజాబ్‌లో జరిగిన ఈ టోర్నీలో రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నాయి. మహిళల టీమ్, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో తెలంగాణ జట్లు మూడో స్థానంలో నిలిచి పతకాలను సాధించాయి. శ్రీ గురు తేజ్ బహదూర్ ఖల్సా కాలేజి ప్రాంగణంలో గురువారం జరిగిన సీనియర్ మహిళల (480 కేజీలు) టీమ్ విభాగంలో తెలంగాణ మహిళల జట్టు 3–0తో బిహార్‌పై గెలుపొంది మూడో స్థానాన్ని దక్కించుకుంది.
అంతకుముందు సెమీస్ మ్యాచ్‌ల్లో పంజాబ్ 3–0తో తెలంగాణపై, కేరళ 3–0తో బిహార్‌పై గెలుపొందాయి. సెమీస్‌లో ఓటమి పాలైన జట్లు కాంస్య పతకం కోసం తలపడ్డాయి. నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కూడిన మిక్స్‌డ్ టీమ్ (540 కేజీలు) విభాగంలో తెలంగాణ 3–0తో మణిపూర్‌ను ఓడించి కాంస్యాన్ని సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో తెలంగాణ 0–3తో ఛత్తీస్‌గఢ్‌పై, మణిపూర్ 0–3తో పంజాబ్ చేతిలో పరాజయం పొం దాయి. జాతీయ స్థాయిలో రాణించిన తెలంగాణ జట్లను తెలంగాణ టగ్ ఆఫ్ వార్ (టీఎస్‌టీడబ్ల్యూఏ) సంఘం అధికారులు, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు శుక్రవారం అభినందించారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్‌టీడబ్ల్యూఏ ఎండీ చల్లా భరత్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎ. మహేశ్, కార్యదర్శి పి. ఎమ్మాన్యుయేల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment