టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహారాష్ట్ర టగ్ ఆఫ్ వార్ సంఘం ఆధ్వర్యంలో కొల్హాపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ అండర్-13 బాలికల జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్ ) చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి పతకం సాధించిన రాష్ట్ర జట్టును శుక్రవారం అభినందించారు.
కాంస్యం నెగ్గిన తెలంగాణ
Published Sat, Nov 12 2016 10:26 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
Advertisement
Advertisement