
బంగ్లాదేశ్‌లో నెలకొన్న అశాంతి కారణంగా అక్కడి ప్రజలు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్) నిరంతరం ప్రయత్నిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 140 మంది బంగ్లాదేశ్ పౌరులను భారత బలగాలు అడ్డుకున్నాయని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.
ఆ దేశంలో నెలకొన్న అశాంతికి భయపడి అక్కడి జనం సరిహద్దుల్లో గుమిగూడుతున్నారని, అయితే అక్కడి తాత్కాలిక ప్రభుత్వం వారి భద్రతకు హామీ ఇచ్చిందని బీఎస్‌ఎఫ్ పేర్కొంది. అయినప్పటికీ అక్కడి పౌరులు కొందరు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బీఎస్‌ఎఫ్‌తో పాటు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ భారత్‌లో చొరబాటుకు యత్నించింన 35 మంది బంగ్లాదేశ్ పౌరులను వారి ఇళ్లకు తిరిగి పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment