photo credit: HINDUSTAN TIMES
జెరూసలెం: భారత్‌లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. పబ్లిక్ ప్లేసులకు, జనాలు ఎక్కువగా పాల్గొనే ఈవెంట్లకు వెళ్లొద్దని సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ బుధవారం హిబ్రూ భాషలో ఒక అడ్వైజరీ జారీ చేసింది.
‘ఢిల్లీలోని దేశ ఎంబసీ ఆఫీసు వద్ద బాంబు పేలుడు సంభవించింది. భారత్‌లో ఉన్న పౌరులు ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మాల్‌లు,మార్కెట్లు లాంటి జనం ఎక్కువగా ఉండే పబ్లిక్ ప్రదేశాలకు వెళ్లొద్దు’ అని ఆ దేశ పౌరులకు ఇజ్రాయెల్ అడ్వైజరీ జారీ చేసింది.
ఢిల్లీ ఎంబసీ వద్ద జరిగిన పేలుడు బహుశా దాడి అయి ఉండొచ్చని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. అయితే పేలుడులో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. పేలుడుపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎంబసీ ఆఫీసు వెనకాల ఉన్న పృథ్వీరాజ్ రోడ్డులో మంగళవారం అత్యంత శబ్ద తీవ్రత కలిగిన బాణాసంచా పేలిందని అందుకే శబ్దం వచ్చిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాగతాలు తమకు తెలుసని పేలుడు ప్రాంతంలో ఒక లేఖ దొరికినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment