లెబనాన్‌లో యుద్ధమేఘాలు.. పౌరులకు భారత్‌ అడ్వైజరీ | India Advisory To Its Citizens In Lebanon | Sakshi
Sakshi News home page

లెబనాన్‌లో యుద్ధ మేఘాలు.. పౌరులకు భారత్‌ అడ్వైజరీ

Published Mon, Jul 29 2024 7:02 PM | Last Updated on Mon, Jul 29 2024 7:30 PM

India Advisory To Its Citizens In Lebanon

న్యూఢిల్లీ: గాజాకు పరిమితమైన ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తాజాగా లెబనాన్‌కూ పాకే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్‌పై లెబనాన్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా దాడి చేయడమే ఇందుకు కారణం. హెజ్బొల్లా దాడికి ప్రతిగా లెబనాన్‌పై ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌ దాడి చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

లెబనాన్‌లోని బీరుట్‌ ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో లెబనాన్‌లోని భారత రాయబారకార్యాలయం అప్రమత్తమైంది. లెబనాన్‌లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని బీరుట్‌లోని తమ కార్యాలయంతో టచ్‌లో ఉండాలని  తాజా అడ్వైజరీ జారీ చేసింది. 

పాలస్తీనాలోని గాజాపై  ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే వాతావరణం ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లోని మజదల్‌ షమ్స్‌పై హెజ్‌బొల్లా దాడి చేసింది. ఈ దాడిలో ఓ 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇజ్రాయెల్‌ ఆగ్రహానికి కారణమైంది. ప్రతిగా  ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై సోమవారం(జులై 29) డ్రోన్‌లతో దాడి మొదలుపెట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement