ధూమపానంపై అనురాగ్‌శర్మ
సాక్షి, సిటీబ్యూరో: ‘ధూమపానాన్ని 23 ఏళ్ల క్రితమే మానేశా. ఈ అలవాటు ఉన్న వారందరూ మానుకోవాలి’ అంటూ పిలుపునిచ్చారు నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ. ‘వరల్డ్ నో టొబాకో డే’ను పురస్కరించుకుని సిటిజన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన శనివారం బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
పోలీసు విభాగంలోని తోటి అధికారులు కూడా ధూమపానం మానుకోవాలని కమిషనర్ కోరారు. సంస్థ నాయకులు రాజనారాయణ ము దిరాజ్, మీరా, అదనపు పోలీసు కమిషనర్లు జితేందర్, సందీప్ శాండిల్యా, జాయింట్ పోలీసు కమిషనర్ మల్లారెడ్డి పాల్గొన్నారు. అలాగే... ఎల్‌బీనగర్ కామినేని హాస్పిటల్స్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహించిన 2కె రన్‌ను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రారంభించారు.
కామినేని హాస్పిటల్స్ డెరైక్టర్ వసుంధర కామినేని, సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు. టొబాకో కంట్రోల్ సెల్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పొగాకు మానాలని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అప్సా, జనచైతన్య వేదిక నిర్వహించిన కార్యక్రమంలో పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు సూచించారు.
నేను మానేశా... మరి మీరు!
Published Sun, Jun 1 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement
Advertisement