వాషింగ్టన్: ఒక్కో దేశానికి ఏటా గరిష్టంగా ఏడు శాతం గ్రీన్‌కార్డులను ఇచ్చేలా ప్రస్తుతం ఉన్న పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను చట్టసభ్యులు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ, అక్కడే ఉద్యోగం చేసుకునేందుకు అనుమతించేవే ఈ గ్రీన్‌కార్డులు. భారత్, చైనా తదితర దేశాల పౌరులు లక్షల మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్నారు. 7 శాతం పరిమితి కారణంగా వీరందరికీ గ్రీన్‌కార్డులు రావడానికి దశాబ్దాల సమయం పడుతోంది.
అదే సమయంలో కొన్ని చిన్న దేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న వారికి గ్రీన్‌కార్డులు సులభంగా లభిస్తున్నాయి. ఇందుకు కారణం ఆయా దేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న పౌరులు తక్కువగా ఉండటమే. ఈ అసమానత తగ్గించి, ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చేందుకు బిల్లులను తీసుకొచ్చారు. రిపబ్లికన్ మైక్ లీ, డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ బుధవారం సెనెట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇలాంటిదే మరో బిల్లును ప్రతినిధుల సభలో చట్ట సభ్యులు జో లోఫ్గ్రెన్, కెన్ బక్‌లు ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు వీటికి మద్దతు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment