
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో కనీసం 9 మంది అమెరికా పౌరులు మరణించారు. మరెందరో ఆచూకీ తెలియకుండా పోయారని అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది.
మరోవైపు ఇజ్రాయెల్‌లో జాడ తెలియకుండా పోయిన 8 మంది ఫ్రాన్స్ దేశస్తులు కూడా హమాస్ మిలిటెంట్లకు చిక్కడమో, వారి చేతిలో మరణించడమో జరిగి ఉంటుందని చెబుతున్నారు. 10 మంది బ్రిటిష్ పౌరులు కూడా హమాస్ దాడుల్లో మరణించడమో, జాడ తెలియకుండా పోవడమో జరిగిందని చెబుతున్నారు.