తియ్యటి వేడుక | Raksha bandan festival to welcome happiness between relationship | Sakshi
Sakshi News home page

తియ్యటి వేడుక

Published Sat, Aug 9 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

తియ్యటి వేడుక

తియ్యటి వేడుక

నగరం రక్షాబంధన్ కళతో వెలుగుతోంది. శ్రావణ పౌర్ణమి రోజున వచ్చే ఈ వేడుకను ఘనంగా, సంబరంగా జరుపుకోవడానికి నగరవాసులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ వేడుకను తీపి చేసేందుకు రకరకాల స్వీట్లు, చాక్లెట్లు రారమ్మని పిలుస్తున్నాయి. ఇవి అందమైన బాక్స్‌లలో, గిఫ్ట్ ప్యాక్‌లలో ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల ఆత్మీయానుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకను థీమ్ స్వీట్లతో జరుపుకునేందుకు ఆహ్వానిస్తున్నాయి. రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పార్లర్లు ప్రత్యేకంగా రాఖీ థీమ్‌తో డిన్నర్స్ నిర్వహిస్తున్నాయి. నోరూరించే ప్రత్యేక, సంప్రదాయమైన ఐటమ్స్‌ను మెనూల్లో చేరుస్తున్నాయి. ఇందులో అగ్రస్థానం స్వీట్లకే ఇస్తున్నాయి. కంటికి ఇంపుగా నోట్లో కరిగిపోయేలా తయారవుతున్న ఈ స్వీట్లను చూసి నగరవాసులు మనసు పారేసుకుంటున్నారు.
 
 రాఖీ అనుబంధాన్ని తెలిపే థీమ్స్, అన్నా చెల్లెళ్ల భావోద్వేగాలనుప్రతిఫలించే కస్టమైజ్డ్ గిఫ్ట్‌లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. గ్రీటింగ్ కొటేషన్స్, ప్రత్యేకమైన బెడ్‌ల్యాంప్‌లు, ఫొటోథీమ్స్ స్పెషల్ అట్రాక్షన్.
 
 రాఖీ థాలీ: వెరైటీ లుక్‌లో ఉండే బాక్స్‌లో నాలుగైదు రకాల బెంగాలీ స్వీట్లు, రాఖీ, కుంకుమ ఉంటాయి. దీనికి ఎంతగా డిమాండ్ ఉందంటే రోజుకు 500-600 థాలీలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
 
 చాకో-రాఖీ బొకే: రకరకాల హ్యాండ్‌మేడ్ చాక్లెట్స్, రాఖీ, అక్షింతలు, వీటిమధ్య తీపిగుర్తుగా ఉండే ఫొటోగ్రాఫ్స్‌ను అందంగా అమర్చిందే చాకో-రాఖీ బొకే.
 
 కస్టమ్ మేడ్-థాలీ: దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.. కస్టమర్ల టేస్ట్‌కు అనుగుణంగా దీన్ని రూపొందిస్తారు. వారు ఇష్టపడే 11 రకాల సంప్రదాయ మిఠాయిలను అందమైన డిజైనర్ సిల్వర్ ప్లేట్‌లో రాఖీని జతచేసి అందిస్తారు.
 
 ట్రెడిషనల్ ఫెస్టివ్ థాలీ: పేరుకు తగినట్లే ఇది సంప్రదాయాన్ని ఒలకబోస్తుంది. ఇందులో ఆర్గానిక్ స్వీట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ షేప్‌లో మిఠాయిలను చేయడం దీని ప్రత్యేకత. వీటితో పాటు డిజైనర్ రాఖీ, చాక్లెట్స్, పసుపు కుంకుమను ఈ థాలీలో అందిస్తారు.
 
 డెలిషియస్ నట్ థాలీ: చూడగానే ఎంతగానో ఆకట్టుకునే ప్రత్యేకమైన థాలీ. రకరకాల నట్స్‌తో ముస్తాబు చేసేదే డెలిషియస్ నట్ థాలీ. బాదం, కాజు, కిస్మిస్, ఆల్మండ్, వాల్‌నట్స్‌తో పాటు బుల్లిబుల్లి చాక్లెట్స్‌ను అందమైన రాఖీని, ముద్దొచ్చే టెడ్డీ డాల్‌ను జోడిస్తారు.
 - శిరీష చల్లపల్లి
 ఫొటోలు: రాజేష్ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement