జలం..గరళం | The overuse of water resources, the elements | Sakshi
Sakshi News home page

జలం..గరళం

Published Tue, Dec 24 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

జలం..గరళం

జలం..గరళం

వరంగల్, న్యూస్‌లైన్ :ఎనభై శాతం వ్యాధులకు కలుషిత నీరే కారణం. నీటిలో మూలకాలు మోతాదుకు మించి ఉంటే అనర్థమే. ఈ మేరకు పల్లె ప్రజ లకు సురక్షిత నీరు అందేలా ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి పంచాయతీలకు తాగునీటి పరీక్షల కిట్‌లను సరఫరా చేసింది. గ్రామాల్లోని బోర్లు, బావులు, నీటి పథకాల నుంచి దశలవారీగా న మూనాలు సేకరించి పీహెచ్ ఎంత ఉంది... క్లో రైడ్, ఫోరైడ్, నైట్రేట్, ఐరన్, సల్ఫేట్ వంటి మూలకాలు మోతాదుకు మించి ఉన్నాయూ... వంటి అంశాలను పరీక్షించి తెలుసుకునేందుకు 2012లో జిల్లాలోని 962 పంచాయతీలకు పం పిణీ చేసింది.

గ్రామీణ నీటి సరఫరా విభాగం అవసరాలకే కాకుండా... పౌరులు కోరితే నీటి ని పరీక్షించి ఇచ్చే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. కానీ.. సర్కారు ప్రయత్నం వృథా ప్రయూసే అయింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎ టువంటి ప్రయోజనం చేకూరలేదు. నీటి పరీ క్షలు చేశామని ఏ ఒక్క గ్రామం నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు అందిన దాఖలాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనానికి ప్రజల్లో అవగాహన లేమి కొరవడడంతో ఈ పథకం లక్ష్యం నీరుగారుతోంది.
 
కిట్‌లు పడేశారు..
 
ఎక్కడైనా నీటి పరీక్షల తర్వాత స్వల్పంగా మోతాదుకు మించి మూలకాలు ఉన్నట్లయితే... ఆ నీటిని ఐదంచెల పద్ధతిలో ఫిల్టర్ చేసి తాగడానికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అధిక శాతంలో మోతాదుకు మించి ఉంటే ఆ నీటిని ప్రజలు తాగకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో గ్రామకార్యదర్శులు చర్యలు చేపట్టాలి. ఇది తమకు భారమనుకున్నారో.. ఏమో పలు పంచాయతీల్లో ఆ కిట్‌లను పడేశారు. మరికొన్ని పంచాయతీల్లో అవి మూలకుపడి ఉన్నాయి. దీంతో ఒక్కో కిట్‌కు రూ. 1200 చొప్పున జిల్లాలో వెచ్చించిన రూ. 11.54 లక్షలు వృథా అయ్యూయి.
 
అక్కరకురాని శిక్షణ

నీటి పరీక్షల కిట్‌లను వినియోగించే విధానంపై గత ఏడాది ఫిబ్రవరిలో మండల కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శి, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్‌ఎంలకు  శిక్షణ ఇచ్చారు. ప్రతి వారం గ్రామంలోని బోర్లు, తాగునీటి పథకాల్లో వచ్చే నీటిని ఈ కిట్ల సాయంతో పరీక్షించాలని... మూడు నెలలకోసారి బాక్టీరియా, ఆరు నెలలకోసారి రసాయన పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు. పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో శిక్షణ పొందిన వారిలో ఎవరో ఒకరు ఈ పనిచేయాల్సి ఉంటుందని...  పరీక్షల నివేదికను ఆర్‌డబ్యూఎస్ అధికారులకు సమర్పించాలని చెప్పారు. అయితే ఎక్కడా నీటిని పరీక్షించిన దాఖలాలు జిల్లాలో లేవు.
 
 స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సర్వేలో తేలిన అంశాలు...
  జనగామ డివిజన్ : చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, నర్మెట, జనగామ రూరల్ మండలాల్లోని 49 గ్రామాల పరిధిలోని నీటిలో ఫ్లోరైడ్ శాతం సగటున 1.4, నైట్రేట్ శాతం 47.9 ఉంది.  ఫ్లోరైడ్ 1-1.5 శాతం ఉంటే ఎటువంటి అనర్థం లేదు. ఈ లెక్కన ఆయూ గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం మోతాదులోనే ఉంది. కానీ.. సగటున 0-45 శాతం ఉండాల్సిన నైట్రేట్ మోతాదును మించి ఉంది.
 
 నర్సంపేట డివిజన్ : దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం మండలాల్లోని 31 గ్రామాల్లోని నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ శాతం ఎక్కువే.  
     
 ములుగుడివిజన్ : పరకాల,రేగొండ, ఏటూ రునాగారం, ములుగు, తాడ్వాయి, మంగపేట, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపురం, గోవిందరావుపేట, కొత్తగూడెం మం డలాల్లోని అన్ని తండాలతో కలిపి 210 గ్రామాల పరిధిలోని నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ శాతం మోతాదును మించి ఉంది.  
     
 మహబూబాబాద్ డివిజన్ : మరిపెడ, కురవి, నర్సింహుల పేట, కేసముద్రం మండలాల్లోని 27 గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ.
     
 వరంగల్ డివిజన్ : రాయపర్తి, జఫర్‌గడ్, ధర్మసాగర్ మండలాల్లోని 15 గ్రామాల్లో ఫ్లోరైడ్, నైట్రేట్ శాతం అధికం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement