
ప్రతీకాత్మక చిత్రం
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 ఇంక్లైన్ కాలనికి చెందిన మెడికో విద్యార్థి నాగపూజిత ఫిలిప్పీన్ దేశంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వైద్య విద్య అభ్యసించేందుకు నాలుగేళ్ల క్రితం నాగపూజిత ఫిలిప్పీన్స్‌కి చేరుకుంది. కాగా 2022 మార్చి7న పరీక్షలు రాసి హాస్టల్‌కి వచ్చి పడుకుంది. ఆమెను లేపేందుకు రూమ్మేట్స్ ప్రయత్నించగా అచేతనంగా కనిపించింది. ఆ తర్వాత నాగపూజిత చనిపోయిన విషయాన్ని గోదావరిఖనిలో ఉన్న తల్లిదండ్రులకు రూమ్మేట్స్ చేరవేశారు.
తన కూతురు మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ నాగపూజిత తండ్రి నాగ శ్రీనివాస్ గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా 2022 మార్చి 29న నాగపూజిత బాడి హైదరాబాద్‌కి చేరుకుంది. దీంతో గోదావరిఖని పోలీసులు గాంధీ హాస్పటిల్‌కి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే మృతికి కారణాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు.
చదవండి: London: హైదరాబాద్ వాలా రెస్టారెంట్‌లో ఎన్నారై యువతిపై కత్తితో దాడి
Comments
Please login to add a commentAdd a comment