Yuki Yuki
-
యూకీ బాంబ్రి ఓటమి
సెమీస్‌లో బోపన్న జోడి చెన్నై ఓపెన్ చెన్నై: భారత యువ టెన్నిస్ ఆటగాడు యూకీ బాంబ్రీ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. చెన్నై ఓపెన్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో తను 3–6, 4–6 తేడాతో వరుస సెట్లలో ఫ్రాన్స్‌కు చెందిన బెనాయిట్ పైర్ చేతిలో ఓడాడు. దీంతో ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లంతా ఓటమి చెందినట్టయ్యింది. గంటన్నరపాటు సాగిన ఈ పోరులో పైర్ ఏకంగా 12 ఏస్‌లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, నెడుంచెళియన్ జంట అతికష్టంగా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో సెరెటాని (అమెరికా), ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) జోడి పై 6–2, 3–6, 12–10 తేడాతో నెగ్గింది. నేను రిటైర్ కావట్లేదు! స్పష్టం చేసిన లియాండర్ పేస్ టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తాను ఆటనుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలను ఖండించాడు. తన మాటలను అపార్థం చేసుకున్నారని అతను వివరణ ఇచ్చాడు. నిజానికి తాను వచ్చే ఏడాది మరో చెన్నై ఓపెన్ గెలవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొత్త భాగస్వామి ఆండ్రీ సా బెగాన్ (బ్రెజిల్)తో కలిసి ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ గెలవాలన్నదే తన ముందున్న లక్ష్యమన్నాడు. -
సాకేత్ ఓటమి
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో మంగళవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యా యి. భారత నంబర్‌వన్, హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... భారత మాజీ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. ఏడో సీడ్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 4–6, 3–6తో ఓడిపోయాడు. గంటా 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఆరు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మరో మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ 6–1, 6–1తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌పై గెలుపొందాడు. -
మెయిన్ ‘డ్రా’కు యూకీ అర్హత
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత మాజీ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో యూకీ 6–3, 6–1తో నికొలస్ కికెర్ (అర్జెంటీనా)పై అలవోకగా గెలిచాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో యూకీ తలపడతాడు. మరో మ్యాచ్‌లో ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్ 6–7 (2/7), 2–6తో జోజెఫ్ కొవాలిక్ (స్లొవేకియా) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’ బెర్త్ దక్కించుకోలేకపోయాడు. -
హాంకాంగ్ ఫ్యూచర్స్ టోర్నీ విజేత యూకీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది తరచూ గాయాల బారిన పడిన భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీ ఖాతాలో ఎట్టకేలకు ఒక టైటిల్ చేరింది. ఆదివారం ముగిసిన హాంకాంగ్ ఓపెన్ ఫ్యూచర్స్ టోర్నమెంట్లో ఈ ఢిల్లీ ప్లేయర్ విజేతగా నిలిచాడు. పోటాపోటీగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 6–4, 7–5తో రెండో సీడ్ షిన్తారో ఇమాయ్ (జపాన్)పై గెలుపొందాడు. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. ఓవరాల్‌గా యూకీ కెరీర్లో ఇది 16వ సింగిల్స్ టైటిల్.