హాంకాంగ్‌ ఫ్యూచర్స్‌ టోర్నీ విజేత యూకీ | The winner of the Hong Kong Futures tournament yuki | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌ ఫ్యూచర్స్‌ టోర్నీ విజేత యూకీ

Published Mon, Dec 26 2016 12:41 AM | Last Updated on Sun, Sep 2 2018 3:21 PM

హాంకాంగ్‌ ఫ్యూచర్స్‌ టోర్నీ విజేత యూకీ - Sakshi

హాంకాంగ్‌ ఫ్యూచర్స్‌ టోర్నీ విజేత యూకీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది తరచూ గాయాల బారిన పడిన భారత టెన్నిస్‌ యువతార యూకీ బాంబ్రీ ఖాతాలో ఎట్టకేలకు ఒక టైటిల్‌ చేరింది. ఆదివారం ముగిసిన హాంకాంగ్‌ ఓపెన్‌ ఫ్యూచర్స్‌ టోర్నమెంట్‌లో ఈ ఢిల్లీ ప్లేయర్‌ విజేతగా నిలిచాడు.

పోటాపోటీగా జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో యూకీ 6–4, 7–5తో రెండో సీడ్‌ షిన్‌తారో ఇమాయ్‌ (జపాన్‌)పై గెలుపొందాడు. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసి, తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. ఓవరాల్‌గా యూకీ కెరీర్‌లో ఇది 16వ సింగిల్స్‌ టైటిల్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement