
సాకేత్ ఓటమి
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో మంగళవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యా యి. భారత నంబర్‌వన్, హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... భారత మాజీ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు.
ఏడో సీడ్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 4–6, 3–6తో ఓడిపోయాడు. గంటా 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఆరు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మరో మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ 6–1, 6–1తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌పై గెలుపొందాడు.