Saket
-
పసిడి పోరుకు సాకేత్–రామ్ జోడీ
ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 6–7 (6/8), 10–0తో ‘సూపర్ టైబ్రేక్’లో సెంగ్‌చన్ హాంగ్–సూన్‌వూ క్వాన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో సనమ్ సింగ్‌తో కలిసి రజత పతకం, మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు. నేడు ఉదయం గం. 7:30 నుంచి జరిగే ఫైనల్లో జేసన్ జంగ్–యు సియో సు (చైనీస్ తైపీ) జంటతో సాకేత్–రామ్ జోడీ తలపడుతుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న–రుతుజా భోస్లే (భారత్) ద్వయం సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రుతుజా 7–5, 6–3తో జిబెక్ కులామ్‌బయేవా–గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)లపై గెలిచారు. నేడు జరిగ సెమీఫైనల్లో యు సియో సు–చాన్ హావో చింగ్ (చైనీస్ తైపీ)లతో బోపన్న–రుతుజా తలపడతారు. -
హౌసింగ్, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం సంస్కరణలు అవశ్యం
న్యూఢిల్లీ: గృహనిర్మాణ రంగం, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కీలక సిఫారసులు చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఒక నివేదికను సమరి్పంచింది. గవర్నర్‌ను కలిసిన బృందానికి పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాలి్మయా నేతృత్వం వహించారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక సవాళ్లు, కొనసాగుతున్న మహమ్మారి ప్రభావం నేపథ్యంలో వృద్ధిని ఉత్తేజపరిచేందుకు గృహనిర్మాణ రంగ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. తక్కువ వడ్డీరేట్లు రేట్లు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. వినియోగాన్ని పెంచుతాయి, పోటీతత్వాన్ని పెంపొందించడానికి దోహదపడతాయి. సవాళ్లను ఎదుర్కొంటున్న పరిశ్రమకు చేయూతను అందిస్తాయి. ► ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో, తగిన లిక్విడిటీని నిర్వహించడంలో (ద్రవ్య లభ్యత) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను మేము అర్థం చేసుకున్నాము. అభినందిస్తున్నాము. అయితే ఇదే సమయంలో వడ్డీ రేట్ల తగ్గింపూ చాలా అవసరం. మా పరిశ్రమకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని ఇది అందిస్తుందని మేము నమ్ముతున్నాము. ► ఎగుమతి రియలైజేషన్ ప్రయోజన కోడ్ల సరిదిద్దడం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఇన్పుట్ ప్రయోజనాల రక్షణ సహా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కరించాల్సి ఉంది. ► విదేశీ సంస్థల కొనుగోళ్ల మాదిరిగానే రూపాయి రుణాలను ఉపయోగించి భారతదేశంలో ఇప్పటికే ఉన్న యూనిట్లు/కంపెనీలను కొనుగోలు చేయడానికి అనుమతించాలి. ప్రస్తుతం, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఏ యూనిట్/కంపెనీని కొనుగోలు చేయడానికి భారతీయ రూపాయిలో బ్యాంక్ రుణం వీలు కల్పించడంలేదు. అయితే భారతదేశం వెలుపల ఏదైనా యూనిట్/కంపెనీని కొనుగోలు చేయడానికి మాత్రం ఇది అందుబాటులో ఉంది. ► విదేశీ వాణిజ్యం విషయానికి వస్తే... ఎగుమతి ఆదాయం నుండి విదేశీ బ్యాంకు చార్జీలను రికవరీ చేయడం, విదేశీ కరెన్సీలో ప్రీ–షిప్మెంట్ క్రెడిట్‌ను సరళీకరించడం (పీసీఎఫ్సీ) వంటివి ఉన్నాయి. ► లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) బకాయిల వర్గీకరణకు సంబంధించి 90 రోజుల పరిమితిని 180 రోజులకు పెంచాలి. తద్వారా ఆయా కంపెనీలు వాటి వర్కింగ్ క్యాపిటల్‌ను వ్యాపార కార్యకలాపాలకు తగిన విధంగా> వినియోగించి సమస్యల నుంచి బయటపడే వీలుంటింది. రుణ వాయి దాల చెల్లింపులకు వర్కింగ్ క్యాపిటల్‌ను వినియోగించుకోవాల్సిన దుస్థితి తొలగిపోతుంది. -
రిటైర్మెంట్ హోమ్స్.. పెద్దల కోసం ప్రత్యేక గృహాలు
సాక్షి, హైదరాబాద్: చదువు, ఉద్యోగం కోసం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న రోజులివి. మరి, మన అనుకునే ఆత్మీయ పలకరింపులు లేని మలి వయసు పెద్దల పరిస్థితేంటి? భద్రత, ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయతలను కలబోసి పెద్దలందరికీ ఆసరాగా నిలుస్తున్నాయి రిటైర్మెంట్ హోమ్స్. ఒకే ఏజ్ గ్రూప్ పెద్దలందరిని ఒకే చోట నివాసితులుగా కలపడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం, వసతులు అన్నీ కూడా పెద్దల అవసరాలకు, అభిరుచులకు తగ్గట్టుగా తీర్చిదిద్దడమే రిటైర్మెంట్ హోమ్స్ ప్రత్యేకత. ఎనభై ఏళ్ల వయసులో భోగి పండ్లు పోస్తారు. వీకెండ్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తారు. బర్త్ డేలు, మ్యారేజ్ డేలతో సర్ప్రైస్ చేస్తుంటారు. పండుగ సమయంలో భక్తిపారవశ్యంలో పులకించిపోతారు... ఇలా ఒక్కటేమిటీ ప్రతి రోజూ ఏదో ఒక పండుగ వాతావరణమే ఉంటుంది రిటైర్మెంట్ హోమ్స్‌లో. ఒకే ఏజ్ గ్రూప్ పెద్దలందరూ ఒకే చోట నివాసం ఉంటే కలిగే ఆనందం, ఆరోగ్యమే వేరు. ఇలాంటి పెద్దల గృహాలను పన్నెండేళ్ల క్రితమే హైదరాబాద్‌కు పరిచయం చేసింది సాకేత్ గ్రూప్. ఈసీఐఎల్ దగ్గరలోని సాకేత్ టౌన్షిప్లో ‘సాకేత్ ప్రణామ్’ పేరిట 333 గృహాలను నిర్మించింది. ప్రస్తుతం గౌడవల్లిలో సాకేత్ ప్రణామం పేరిట రెండవ రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. త్వరలో నగరం నలువైపులా ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని సాకేత్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రవి కుమార్ చెప్పారు. గౌడవల్లిలో 80 ఎకరాల విస్తీర్ణంలో సాకేత్ భూఃసత్వ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 5.65 ఎకరాల్లో సాకేత్ ప్రణామం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. నాలుగు బ్లాక్‌లలో 513 ఫ్లాట్లుంటాయి. 411 చ.అ. నుంచి 2,700 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ఏ–బ్లాక్ 197 ఫ్లాట్ల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఇందులో ఆక్యుపెన్సీ మొదలైంది. కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కూడా. బీ–బ్లాక్ లోని 163 గృహ నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2022 చివరికి పూర్తవుతాయి. సీ,డీ– బ్లాక్‌లు 2023లో కస్టమర్స్‌కు అందుబాటులోకి వస్తాయి. సాకేత్ – భూఃసత్వ ప్రాజెక్ట్‌లో ఫేజ్–1 కింద 220 విల్లాలను నిర్మించారు. ఇందులో 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం ఫేజ్–4లో 70 విల్లాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణంలోనూ అవసరాలకే ప్రాధాన్యం.. పెద్దల అవసరాలకు తగ్గట్టుగానే రిటైర్మెంట్ గృహాలు నిర్మిస్తారు. వీల్‌చెయిర్ వెళ్లేంత వెడల్పాటి డోర్లు, బాత్రూమ్స్, లిఫ్ట్ ఉంటాయి. బాత్రూమ్, కారిడార్లు, హాల్లో గ్రాబ్ బార్స్, అత్యవసర సమయాల్లో వినియోగించే ప్యానిక్ బజర్లు ఉంటాయి. ప్రాజెక్ట్ అంతా యాంటీ స్కిడ్ ఫ్లోరింగే ఉంటుంది. ప్రాజెక్ట్‌లోని మొత్తం స్థలంలో కేవలం 30 శాతం మాత్రమే నిర్మాణం ఉంటుంది. మిగిలిన 70 శాతం ఓపెన్ స్పేస్, చెట్ల కోసం కేటాయించారు. రెస్టారెంట్, ఏసీ డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. నివాసితులు కావాలంటే డైనింగ్ హాల్‌కు వచ్చి భోజనం చేయవచ్చు. లేదా ఫ్లాట్ కే పంపిస్తారు. ఇంట్లో పనులకు ప్రత్యేకించి పనిమనుషులుంటారు. 24 గంటలూ సీసీ కెమెరాల నీడలో కట్టుదిట్టమైన భద్రతా ఉంటుంది. పెద్దల అవసరాలే వసతులుగా.. రిటైర్మెంట్ హోమ్స్ నిర్మాణంలోనే కాదు వసతుల ఏర్పాట్లలోనూ పెద్దల అవసరాలకు తగ్గట్టుగానే ఉంటాయి. ఉదాహరణకు పెబల్స్ మీద వాకింగ్ ట్రాక్, గెరియాట్రిక్ జిమ్, పచ్చని చెట్ల గాలిని పీలుస్తూ కూర్చోవటానికి వీలుగా బెంచీలు, యోగా, మెడిటేషన్ హాల్, లైబ్రరీ, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇలా గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే ప్రతీ ఒక్క వసతులు ఇందులోనూ ఉంటాయి. అంబులెన్స్, ప్రతి బ్లాక్ లో ప్రత్యేకంగా నర్స్, అటెండర్ అందుబాటులో ఉంటారు. సాకేత్ ప్రణామంలో 30 వేల చ.అ.ల్లో వెల్ నెస్ హబ్ ను తీర్చిదిద్దుతున్నామని రవి కుమార్ తెలిపారు. ఒకేసారి 200 మంది కూర్చొని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు వీలైన మల్టీ పర్పస్ హాల్ కూడా ఉంటుంది. చదవండి: హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్.. రికార్డ్ బ్రేక్ సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే! -
కొత్త తలుపు
తలపు ఒక తలుపు మంచి ఆలోచన ఉంటే మంచి వాకిళ్లు స్వాగతం చెబుతాయి. జన్మ జన్మలు ఆ మంచితోనే ముడిపడి ఉంటాయన్నది నమ్మకం. ఒక జన్మలో తీరని తృష్ణ మరు జన్మలో ఎందరి దాహమో తీర్చే సేవగా మారవచ్చు. అటు జన్మ, ఇటు జన్మ గురించి అంత కచ్చితంగా చెప్పలేం కానీ, ఈ జన్మకు మంచి పని చేస్తే తిరిగి మంచి జరుగుతుందని ఒక అందమైన కొత్త తలపు, కొత్త తలుపు తెరుచుకుంటుందని నమ్ముతాం. వళ్లంతా పుళ్లు వాటి నుంచి కారుతున్న రసి. ముక్కుతూ మూలుగుతూ మట్టికొట్టుకుపోయిన దేహాలు. వారి నుంచి ముక్కులు పగిలిపోయేటంత దుర్గంధం. దూరం నుంచి చూస్తుంటేనే కడుపులో తిప్పినట్టు అవుతోంది. అలాంటిది, వారిని చేత్తో ఆప్యాయంగా నిమురుతు న్నాడు. వాళ్లు వద్దని మొరాయిస్తున్న కొద్దీ బతిమిలాడుతూ జుట్టు కత్తిరించి, స్నానం చేయిస్తున్నాడు. పుళ్లకు మందు రాసి, బట్టలు వేస్తున్నాడు. అమ్మలా గోరుముద్దలు తినిపిస్తున్నాడు. ఈ పనులన్నీ ఏ విసుగూ లేకుండా చేస్తూ దేవదూతలా కనిపిస్తున్న ఆ వ్యక్తిని తదేకంగా చూస్తూ నిల్చుండిపోయాడు వాసుదేవరావు. సూటు బూటు వేసుకుని శ్రీమంతుడిలా ఉన్న వాసుదేవరావును అనుమానంగా చూస్తూ అక్కడి వాచ్మెన్ ‘సార్..’ అని గట్టిగా పిలిచాడు. ఉలిక్కిపడి చూశాడతడిని. ‘‘ఎవరు మీరు! ఏం కావాలి..’’ అన్నాడు వాచ్మెన్. ‘‘అతను.. అతను.. నా కొడుకు...’’ అనాథలకు సేవ చేస్తూ వారే లోకంగా ఉన్న అతడిని చూపించాడు. ‘‘అవునా!’’ ఆశ్చర్యపోతూనే అభిమానంగా ‘‘రండయ్యా! రండి, లోపలికి రండి. ఇక్కడ కూర్చోండి. సార్‌ని పిలుచుకొస్తా!’’ సాదరంగా తోడ్కొని కుర్చీలో కూర్చోబెట్టి గబగబా వెళ్లాడు అతను. విధి... విలాసం ఆశ్రమంలో అందరితో పాటు భోజనం చేస్తున్నాడు వాసుదేవరావు. అందరికీ కొసరి కొసరి వడ్డిస్తున్నాడు తన కొడుకు సాకేత్. అతని మొహంలోని ప్రశాంతతను, ఆనందాన్ని చూస్తున్నాడు వాసుదేవరావు. అందరూ సాకేత్‌ని దేవుడిలా చూస్తున్నారు. కానీ, తనకు మాత్రం ఇంకా కొడుకు భవిష్యత్తే కనపడుతోంది. కళ్ల ముందు మాత్రం తను నిర్మించుకున్న సామ్రాజ్యం కదలాడుతోంది. తను వయసులో ఉన్నప్పుడు ఉన్న ఊళ్లో ఆస్తులమ్ముకొని విదేశాలకు వెళ్లాడు. అక్కడ బిజినెస్ పెట్టి భారీగా సంపాదించాడు. భార్య, కూతురు, కొడుకు.. కోట్లలో ఆస్తులు. దేనికీ లోటు లేదు. మంచి స్థితిమంతుడికి కూతురినిచ్చి పెళ్ళి చేశాడు. ఇక మిగిలింది సాకేత్ ఒక్కడే. ఇంజనీరింగ్ చదివించాడు. తన బిజినెస్‌లను చూసుకునేవాడు. ఆరేడేళ్ల్ల క్రితం ఓ రోజు.. ‘‘నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను డాడీ. మన దేశానికి వెళతాను’’ అన్నాడు. ఆశ్చర్యపోయాడు తను. ‘‘నువ్వు పుట్టిందీ పెరిగిందీ ఇక్కడే. మనదేశానికి వెళతాను అంటావేంటి?’’ ఆశ్చర్యపోతూ అడిగాను. ‘‘ఏమో, ఈ ప్రాంతం నాది కాదనిపిస్తోంది. నేను ఈ వ్యాపారాలు కాకుండా ఇంకా ఏదో చేయాలనిపిస్తోంది..’ అన్నాడు సాకేత్. ‘‘అదేంట్రా.. పెళ్లి చేసుకొని హాయిగా ఉండక. ఎక్కడెక్కడికో వెళతానంటావేంటి’’ అంది తల్లి. ‘‘లేదమ్మా! అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’’ అన్నాడు సాకేత్. తండ్రీ–కొడుకు మధ్య వాదనలయ్యాయి. తల్లి ఏడుపు, తండ్రి నిష్టూరం.. ఏమీ పట్టించుకోలేదు సాకేత్. ఓ రోజు.. ఉదయాన్నే సాకేత్ రూమ్‌లో ఓ లెటర్ దొరికింది. తను వెళ్లిపోతు న్నానని, తన కోసం వెతకద్దని రాసుంది అందులో. వాసుదేవరావు కొడుకు మీద ఆశలు వదిలేసుకున్నాడు. భార్య ఏడుస్తూనే కాలం గడుపుతోంది. ఏళ్లు గడుస్తున్నాయి.. ఈ మధ్య కొడుకు మీద బెంగ ఎక్కువై భార్య మంచం పట్టింది. ఇన్నేళ్లకు సాకేత్ ఉన్న చోటు తెలిసింది వాసుదేవరావుకి. ఆగమేఘాల మీద బయల్దేరాడు. బతిమాలో, బామాలో వెంటతీసుకుద్దామని. ఏది సామ్రాజ్యం? కానీ, తను ఇక్కడ చూస్తున్నది వేరు. అనాథలకు సేవ చేస్తూ.. వారి మలమూత్రాదులు ఎత్తుతూ వారిని కంటికి రెప్పలా సాకుతూ అదే జీవితంలా సాకేత్ కనిపించాడు. ఒంటరిగా ఉన్న సాకేత్ దగ్గరగా వెళ్లాడు వాసుదేవరావు. ‘‘సాకేత్.. నీ మీదే ఆశలెన్నో పెట్టుకున్నాం మీ అమ్మా నేను. నీ కోసం ఓ అందమైన సామ్రాజ్యాన్నే నిర్మించాను. అవన్నీ వదిలేసి అనాథల మధ్య నువ్వు గడుపుతున్న జీవితం చూస్తుంటే బాధగా ఉంది. ఇంత మంది ముసలీ, ముతకను ఆదరిస్తున్న నీవు ఈ వయసులో ఈ ముసలితల్లిదండ్రులను ఎందుకు దూరం చేస్తున్నావ్! అక్కడ నీ తల్లి బెంగతో మంచంపట్టింది. మమ్మల్ని అనాథలను చేయకు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. వీళ్లందరి కోసం డబ్బులు పంపిద్దాం. మంచి కేర్‌టేకర్‌ని పెడదాం. మన ఇంటికి వచ్చేయ్!’ అన్నాడు కొడుకును బతిమాలుతూ! ‘‘డాడీ, నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు. చాలా సంతోషం. అమ్మను కూడా ఇక్కడకే తీసుకురండి వ్యాపారాలన్నీ ఎవరికైనా అప్పజెప్పండి. అంతా ఇక్కడే ఉందాం’’ అన్నాడు సాకేత్ అంతకుమించి మాట్లాడటానికి ఏమీ లేదన్నట్టు. గతం ఏం చెబుతోంది? ‘‘సాకేత్.. మీరు గతాన్వేషణలో ఉన్నారు. ఇప్పటి నుంచి 10 ఏళ్లు, అటు నుంచి 20 ఏళ్ల క్రితం వరకు మీ జీవితాన్ని దర్శించండి. ఆ అన్వేషణలో మిమ్మల్ని కలచివేసిందేంటో వివరించంyì ’’ అన్నారు కౌన్సెలర్.తండ్రి బలవంతమ్మీద పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపీకి వచ్చాడు సాకేత్. అషైశ్వార్యాల మధ్య పెరిగినవాడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకోవాలని ఉందని వాసుదేవరావు పట్టుబట్టాడు. సాకేత్ సరేననడంతో థెరపీ మొదలైంది. ఎంతో ప్రశాంతంగా, మరెంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో కౌన్సెలర్ ముందున్నారు సాకేత్, వాసుదేవరావు. మెత్తటి వాలుకుర్చీలో విశ్రాంతిగా కళ్లు మూసుకుని కూర్చున్నాడు. థెరపీలో సాకేత్ అంతర్‌ప్రయాణం మొదలైంది. క్షణాలు.. నిమిషాలు గడుస్తున్నాయి. సాకేత్ అంతర్‌ప్రయాణం మొదలైంది. ఇరవై ఏళ్ల క్రితం జీవితాన్ని వివరిస్తున్నాడు సాకేత్... ‘‘నా తల్లి, తండ్రి నన్ను అపురూపంగా చూసుకుంటున్నారు. ఏం కావాలన్నా క్షణంలో అమర్చుతున్నారు. చదువులో మంచి మార్కులు, చెల్లిలితో పోట్లాటలు.. ’ అంతా ఆనందంగా ఉంది...’’ చెబుతున్న సాకేత్‌ని మరో పదేళ్ల వెనక్కి.. ఆ తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పటి స్థితిని వివరించండి...’’అన్నారు కౌన్సెలర్. వాసుదేవరావు కొడుకు చెబుతున్న విషయాలను ఆసక్తిగా ఆతృతగా వింటున్నాడు. కాసేపు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో సాకేత్ చెప్పడం మొదలుపెట్టాడు.. ‘‘నేనో కాంతిగోళం నుంచి అణువంత వెలుగునై ఓ చీకటి గుహలోకి చేరుతున్నాను. అది నా తల్లి గర్భం. కానీ, నాలో అంతులేని అలజడి. ఈ జన్మను నేను సార్థకం చేసుకోగలనా?!’’ అనిపిస్తోంది సాకేత్ వివరణ వింటున్న కౌన్సెలర్ ‘‘ఎందుకు అలజడి? దానికి గల కారణాన్ని అన్వేషించాలంటే మీరింకా వెనక్కి ప్రయాణించండి. అక్కడ ఏం జరుగుతుందో దర్శించండి’’ అన్నారు. కౌన్సెలర్ సూచనలు అందుతున్నాయి సాకేత్ కి. మెళ్లగా అతని చెవులకు ఎంతోమంది ఆక్రందనలు వినపడటం మొదలుపెట్టాయి. కనులు మూసుకొని ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టు ఉన్న సాకేత్ మొహం ఒక్కసారిగా ఉద్వేగంగా మారిపోయింది. అలమటించే అభాగ్యులు సాకేత్ మíస్తిష్కంలో కనిపిస్తున్నది వివరిస్తున్నాడు. ‘‘నేనో గూడెంలో ఉన్నాను. ఆ గూడెం నాయకుడి సేవకుడిని నేను. అతనేం చెప్పినా ఎదురుచెప్పకుండా పనులు చేయాల్సిన విధి నాది. ఓ సారి మా ప్రాంతంలో తీవ్రమైన కరువొచ్చింది. అయినా, అక్కడున్న వనరుల వల్ల మా గూడెంలో తిండికీ, నీటికి పెద్ద కష్టాలు రాలేదు. కానీ, మా పొరుగు గూడెం జనం తిండికీ, నీళ్లకూఅలమటిస్తున్నారు. వాళ్ల అవసరాలు తీర్చుకోవడానికి మా గూడేనికి వచ్చి మొరపెట్టుకున్నారు. కానీ, మా నాయకుడి హృదయం కరగలేదు. పిల్లల ఆకలి తీర్చలేక నిస్సహాయ స్థితిలో వాళ్లలో కొందరు ఎదిరించారు. ఎదిరించిన వారిని చెట్లకు కట్టేసి భయానకంగా కొట్టించాడు మా నాయకుడు. వాళ్ల ఒళ్లంతా రక్తసిక్తమయ్యాయి. వాళ్ల పరిస్థితికి నా కడుపు తరుక్కుపోయింది. వాళ్ల కష్టాలు చూసి తిండి సహించేది కాదు. నిద్రపట్టేది కాదు. మా గూడెం కట్టుబాట్ల ప్రకారం నాయకుడికి తెలియకుండా ఏ పనీ చేయకూడదు. కానీ, నాయకుడు లేని సమయం చూసి వాళ్లకు నీళ్లు, తిండి సాయం చేశాను. ఇది మా నాయకుడికి తెలిసింది. నాలాగ మిగతావాళ్లు తనను ధిక్కరిస్తారని నన్ను ఉరి తీయమని ఆదేశించాడు. అప్పుడే అనుకున్నాను. ‘సాటి జీవులపై కరుణ చూపని ఈ జన్మ ఎందుకు?. ఆకలితో, దాహంతో అలమటిస్తున్నవారికి గుక్కెడు నీళ్లు, బుక్కెడు తిండి పెట్టని జన్మ వృథా. నేను నేనుగా ఎదగాలి, దీనులకు నాకు చేతనైన సాయం చేయాలి’ అనుకున్నాను. సేవ చేయడానికే ఈ జన్మ తీసుకున్నాను. నా విధిని నేను నిర్వర్తిస్తాను’’ అని చెబుతున్న సాకేత్ దృఢనిశ్చయం అబ్బురమనిపించింది వాసుదేవరావుకి. స్వదేశంలో... భార్యతో సహా తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు వాసుదేవరావు. కొడుకు చేస్తున్న సేవలో తనూ భాగస్తుడయ్యాడు. ఆనందం కోట్లు ఖర్చుపెట్టి కట్టుకున్న కోటల్లో ఉండదని, ఎదుటివాడి కష్టం తీర్చడంలో ఉందని కొడుకు ద్వారా గ్రహించాడు. అదే ఈ దశలో నేర్చుకోదగిన పాఠం అని గుర్తించాడు. సేవలోనే కర్మ ప్రక్షాళన సృష్టి అంతటా ఉన్న చైతన్యం మనలోనూ ఉంది. ఆ చైతన్యం తప్పకుండా ఎదగాల్సి ఉంటుంది. ఇవ్వడంలో దివ్యత్వం మనలో ప్రవేశిస్తుంది. అందుకే ఇచ్చేవారిలో ఈశ్వరుడు ఉంటాడు అంటాం. అలాగే సేవాభిరుచిని నారాయణడి సేవతో పోల్చుతాం. నర అంటే శరీరం. ఆయణ అంటే శక్తి. ఈ దైవత్యం ఒకరి నుంచి ఒకరికి ప్రవహించాలి. సేవలోనే కర్మల ప్రక్షాళన జరుగుతుంది. కర్మలు నశించినప్పుడు మోక్షప్రాప్తి లభిస్తుంది. భగవద్గీత, బైబిల్, ఖురాన్ చెప్పినవి ఇవే! – డాక్టర్ హరికుమార్, జనరల్ సర్జన్, బ్లిస్ఫుల్ లైఫ్ ఫౌండేషన్, హైదరాబాద్ ‘నేను ఎవరిని...’ అనే ప్రశ్న ఉదయించాలి ఆత్మ పరిణతి చెందేంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. పుట్టుక నుంచి మరణం వరకు మనిషి జీవన దశలు ఏ విధంగానైతే ఉంటాయో ఆత్మ దశలు అలాగే ఉంటాయి. శైశవ ఆత్మలు: ఈ దశలో ఉన్నవారిలో జంతు ప్రవృత్తి అధికం. ఆహారం కోసం, స్త్రీ కోసం, ధనం కోసం ఒకరినొకరు చంపుకోవడం ఉంటుంది. యువ ఆత్మలు: డబ్బు సంపాదన, కీర్తి కండూతి, కుటుంబ బంధాలు కోరుకుంటారు. ప్రస్తుతం సమాజం ఈ దశలోనే ఉంది. వృద్ధాత్మలుపై రెండు దశలు దాటిన తర్వాత ‘నేను ఎవరిని’ అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇక్కడే వృద్ధాత్మలుగా పరిణతి చెందుతారు. అప్పుడే సాటి జీవుల పట్ల కరుణ, దయ కలుగుతాయి. ప్రేమను పంచుతారు. ప్రస్తుత సమాజంలో వీటి సంఖ్య చాలా చాలా తక్కువ. కోటికి ఒకరుగా ఉంటున్నారు. ఈ దశకు చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అనంతాత్మలు: కృష్ణుడు, బుద్ధుడు, వివేకానందుడు, మదర్‌థెరిస్సా.. లాంటి వారు కొన్ని కోట్ల మందిలో మార్పు తీసుకురావడానికి వచ్చినవారు. వారు ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో నేర్చుకొని ఆ దశకు చేరుకున్నవారు. మనకు మార్గనిర్దేశకులయ్యారు. ప్రతి ఆత్మ ఈ దశకు చేరుకునేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. – డా. లక్ష్మీ న్యూటన్, పాస్ట్ లైఫ్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చి అకాడమీ, హైదరాబాద్ పాఠాలు నేర్చుకోవడానికే! ►ఈ లోకం ఒక విశ్వవిద్యాలయం. ప్రతి జన్మనూ ఈ విశ్వవిద్యాలయంలో నేర్చుకోవడం కోసమే తీసుకుంటాం. ►ప్రతి జన్మలోనూ పరిణతి పొందేందుకే ఆరాటపడుతుంటాం. ►ప్రతి జన్మలోనూ వచ్చే సవాళ్లు ఒక పుస్తకం. ఆ పాఠాలను నేర్చుకుంటేనే సవాళ్లను సులువుగా అధిగమించగలం. ►మోక్షం సిద్ధించాలంటే బయటెక్కడో కాదు మనలో ఉన్న ‘దయ’ అనే ఆలయాన్ని దర్శించాలి. – నిర్మల చిల్కమర్రి -
సాకేత్ ఓటమి
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో మంగళవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యా యి. భారత నంబర్‌వన్, హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... భారత మాజీ నంబర్‌వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. ఏడో సీడ్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 4–6, 3–6తో ఓడిపోయాడు. గంటా 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఆరు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మరో మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ 6–1, 6–1తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌పై గెలుపొందాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్
పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, హైదరాబాద్ ఆటగాడు సాకేత్ మైనేని క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 6-0, 2-6, 6-1తో భారత్‌కే చెందిన సిద్ధార్థ్ రావత్‌ను ఓడించాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో విష్ణువర్ధన్ 4-6, 4-6తో దిమిత్రీ పోప్కో (కజకిస్తాన్) చేతిలో, ఐదో సీడ్ రామ్‌కుమార్ రామనాథన్ 2-6, 5-7తో సాడియో డుంబియా (ఫ్రాన్స) చేతిలో, సుమీత్ నాగల్ 7-6 (7/2), 6-7 (6/8), 4-6తో అడ్రియన్ మెనెన్‌డెజ్ (స్పెరుున్) చేతిలో ఓడిపోయారు. 19 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో ఓ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆడుతోన్న లియాండర్ పేస్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో పేస్-రామ్‌కుమార్ ద్వయం 6-3, 6-4తో అన్విత్ బెంద్రే-సిద్ధార్థ్ రావత్ (భారత్) జంటపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్స్‌లో విష్ణువర్ధన్-శ్రీరామ్ బాలాజీ జంట 3-6, 4-6తో పెట్రోవిచ్-మిలోజెవిచ్ (సెర్బియా) జోడీ చేతిలో, మొహిత్-కాజా వినాయక్ శర్మ ద్వయం 2-6, 4-6తో జీవన్-విజయ్ జంట చేతిలో ఓడిపోయారుు. -
రన్నరప్ సాకేత్
న్యూఢిల్లీ: ఫైనల్ చేరే క్రమంలో నిలకడగా రాణిం చిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని కీలకమైన టైటిల్ పోరులో తడబడ్డాడు. ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ సాకేత్ 3-6, 0-6తో స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. గంటలోపే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ వరుసగా పది గేమ్‌లు కోల్పోయాడు. తొలి సెట్లో కాస్త పోటీనిచ్చిన అతను రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేశాడు. రన్నరప్‌గా నిలిచిన సాకేత్‌కు 4,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 91 వేలు)తోపాటు 48 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో సాకేత్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-150లోకి వచ్చే అవకాశముంది. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
లెక్సింగ్టన్ (అమెరికా): ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్‌కప్ జట్టు ఆటగాడు సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తన భాగస్వామి దిమితార్ కుత్రోవ్స్కీ (బల్గేరియా)తో కలిసి సాకేత్ తొలి రౌండ్లో 7-5, 5-7, 10-7తో టాప్ సీడ్ జోడీ అలెక్స్ బోల్ట్-ఆండ్రూ విటింగ్టన్ (ఆస్ట్రేలియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం సాకేత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. ఏడో సీడ్ లియామ్ బ్రాడీ (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 2-6, 1-6తో ఓడిపోయాడు.మరోవైపు అట్లాంటా ఓపెన్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. జారెడ్ డొనాల్డ్సన్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 1-6, 6-3, 4-6తో ఓడిపోయాడు. -
ప్రేమకు మరణం లేదు!
స్వచ్ఛమైన ప్రేమకు మరణం లేదనే కథాంశంతో సువర్ణ సమర్పణలో పవన్‌కుమార్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘కోమలి’. నూతన దర్శకుడు స్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా సవీన్ రాయ్, సాకేత్, కార్తీక్, సాయి క్రిష్ణ, కాజల్, సంజన, కవిత హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘స్వచ్ఛమైన ప్రేమ గెలవడం ఖాయమని చెప్పే చిత్రం ఇది. అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. నిజామాబాద్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కమలాకర్ రావు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడం విశేషం. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కబీర్ రఫీ, రచన: సురేష్ జై, ఎడిటింగ్: యాదగిరి. -
టెన్నిస్ ద్రోణుడు
అర్జునుడు విలువిద్యలో నేర్పరి అని కొనియాడే సమయంలో ద్రోణాచార్యుడిని కూడా తలుచుకోవాలని మహాభారతం గుర్తు చేస్తుంది. ఆ స్ఫూర్తితోనే భారతదేశ వర్ధమాన టెన్నిస్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్, సురేశ్ కృష్ణ, పి.సి. విఘ్నేశ్, వై. సందీప్‌రెడ్డి, సౌజన్య భవిశెట్టి... వంటి వారి గురించి చెప్పుకునే ప్రతిసారీ.. వారిని మేటి క్రీడాకారులుగా తీర్చి దిద్దిన కోచ్ సి. వి. నాగరాజును కూడా గుర్తు చేసుకోవాలి. సికింద్రాబాద్‌లోని ఆర్ ఆర్ సి (రైల్వే రిక్రియేషన్ క్లబ్) గ్రౌండ్స్‌లో ఐదేళ్ల నుంచి 22 ఏళ్ల వయసున్న సుమారు యాభై మంది పిల్లలు టెన్నిస్ సాధన చేస్తున్నారు. కొందరు పిల్లల తల్లులు ఓ పక్కగా కూర్చుని ఓ కంట టెన్నిస్ సాధనను గమనిస్తూ కబుర్లలో ఉన్నారు. ప్రాక్టీస్ చేస్తున్న పిల్లల్లో ప్రతి ఒక్కరి ఆటతీరును గమనిస్తూ ఉన్నారు 53 ఏళ్ల కంజీవరం వెంకట్రావు నాగరాజు. షాట్లో పొరపాటు జరిగితే వెంటనే పిల్లలను పేరుతో పిలిచి షాట్ అలా కాదంటూ వెళ్లి సరిచేస్తున్నారు. ఇంతలో ఓ కుర్రాడు మడమకు దెబ్బ తగిలించుకున్నాడు. వెంటనే క్రేప్ బ్యాండేజ్‌తో కట్టుకట్టి ‘ఈ రోజుకి ఇక ఆడకు. ఇంటికి వెళ్లి మమ్మీడాడీతో ఫోన్ చేయించు, ఏం చేయాలో చెప్తాను’ అని ఓ పక్కన కూర్చోబెట్టారు. రాకెట్ పట్టుకోవడం మొదలు ఆటలో మెలకువలు నేర్పించడం, గాయమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం, క్రీడాకారులు తీసుకోవాల్సిన రోజువారీ ఆహార పట్టిక తయారు చేసివ్వడం వరకు కోచ్‌దే బాధ్యత. అలా ఈ కోచ్ చేతిలో తయారైన టెన్నిస్ క్రీడాకారులు ఇవాళ జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. ‘‘సాకేత్ మైనేని, విష్ణువర్ధన్, సౌజన్య భవిశెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. నా విద్యార్థులు డేవిస్ కప్ సాధించారు, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు గెలుచుకున్నారు. శిక్షకుడిగా నా సంతోషం నేను తయారు చేసిన వారి విజయాల్లోనే ఉంటుంది’’ అంటారు నాగరాజు. తెలుగు నేలపై నాలుగోతరం..! తల్లిదండ్రులిద్దరూ మంచి క్రీడాకారులు కావడమే తనను క్రీడల వైపు మరల్చింది అంటారు నాగరాజు. ‘‘మా అమ్మ రాజేశ్వరీ వెంకట్రావ్ బెంగుళూరులో టెన్నిస్ ఆడేది. తండ్రి సి.డి. వెంకట్రావ్ ఉస్మానియా తరఫున ఆడేవారు. నేను జూనియర్స్ లెవెల్లో నేషనల్స్ ఆడాను. సాధారణ ఉద్యోగాలు చేస్తే టెన్నిస్‌కు దూరం కావాల్సిందే అని తెలిసిన తర్వాత టెన్నిస్ కోచ్ కావడానికి కావల్సిన కోర్సులు చేసి శిక్షకుడిగా మారాను’’ అని వివరించారాయన. నాగరాజు పూర్వీకులది తమిళనాడులోకి కంజీవరం. నాలుగు తరాల ముందు శ్రీనివాసన్ సికింద్రాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అతడి కుమారుడు దామోదర్ మొదలియార్ డెక్కన్ రైల్వేస్‌లో ఉద్యోగి. అతడి కుమారుడే టెన్నిస్ క్రీడాకారుడు సి.డి. వెంకట్రావ్ - ప్రస్తుతం టెన్నిస్ శిక్షకులైన నాగరాజు తండ్రి. అలా తమిళనాడు నుంచి వచ్చి తెలుగుగడ్డపై స్థిరపడినవారిలో నాలుగోతరం తనదంటారాయన. ఇంతమంది క్రీడాకారులను తయారు చేస్తున్నప్పటికీ తన కుటుంబం నుంచి టెన్నిస్ వారసులను తయారు చేయలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు నాగరాజు. ‘‘నాకు ఒక్కతే అమ్మాయి. పేరు సాయికుమారి. నేను పొద్దున్నే గ్రౌండ్‌కి వచ్చేవాడిని. తిరిగి ఇంటికి వెళ్లేటప్పటికి అమ్మాయి స్కూలుకెళ్ళేది. సాయంత్రం తాను ఇంటికి వచ్చేటప్పటికి నేను గ్రౌండ్‌కు రావడం, నేను ఇల్లు చేరేసరికి తను నిద్రపోవడం... తన బాల్యం దాదాపుగా ఇలాగే గడిచింది. తనకు టెన్నిస్ నేర్పించాలని నేను చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మా ఆవిడ టీచరు కావడంతోనో ఏమో మా అమ్మాయికి పుస్తకాల మీద, చదువు మీద ఆసక్తి ఎక్కువగా కనిపించింది. దాంతో తనను అలాగే కొనసాగనిచ్చాం. ఆమె ఇప్పుడు ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తూ భర్తతో కలిసి ముంబయిలో ఉంటోంది. తండ్రిగా నన్ను చాలా ప్రేమిస్తుంది కానీ, తనకు టెన్నిస్ మీద ప్రేమ కలగలేదు’’ అన్నారాయన కొంచెం బాధగా. ఇది నిరంతర సాధన! పిల్లలను క్రీడాకారులుగా తయారు చేయాలంటే వారికి కనీసంగా గ్రౌండ్‌కి రాగలిగిన ఆసక్తి ఉంటే చాలు, ఆ తర్వాత వారిని చైతన్యవంతం చేసి క్రీడాస్ఫూర్తి పెంచడం పెద్ద కష్టం కాదంటారు నాగరాజు. ‘‘టెన్నిస్ సాధన ఐదేళ్ల వయసులో మొదలు పెట్టి ఇరవై రెండు - ఇరవై మూడేళ్లు వచ్చే వరకు నిరంతరాయంగా చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారు. పద్దెనిమిదేళ్ల ముందే ఓ కల కనాలి. ఆ కలను సాకారం చేసుకోవడానికి అంతకాలం పాటు ఓపిగ్గా శ్రమించాలి’’ అని సూచించారు నాగరాజు. ఉత్తమ శిక్షకుడిగా ‘ఫార్కుందా అలీ అవార్డు’, ‘ప్రైడ్ ఇండియా’ పురస్కారాలను అందుకున్న నాగరాజు ప్రభుత్వం సహకరించి మంచి క్రీడాప్రాంగణానికి అవకాశం కల్పిస్తే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయగలనని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. నిజమే! ద్రోణాచార్యుడైనా సరే అంత గొప్ప విలుకాళ్లను తయారు చేయగలిగాడంటే పాలకులు తగిన వనరులు కల్పించడం వల్లే సాధ్యమైంది. ఆధునిక యుగానికీ అదే వర్తిస్తుంది. - వాకా మంజులారెడ్డి ఫొటోలు: శివ మల్లాల ‘‘తల్లిదండ్రులు కొంత ఖర్చుకు, కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. పెళ్లిళ్లు, వేడుకలంటూ సాధనకు అంతరాయం రానివ్వకూడదు. పిల్లలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల ఆట కోసమే సమయాన్ని కేటాయించాలి. కోచ్ఫీజు, పిల్లల దుస్తులు, టోర్నమెంట్లకు తీసుకెళ్లే చార్జీల వంటివి కలుపుకుని నెలకు పది నుంచి పదిహేను వేల ఖర్చు ఉంటుంది. వారిని గ్రౌండ్‌కు తీసుకురావడం, సూచించిన పోషకాహారం పెట్టడం వరకు తల్లిదండ్రులు చూసుకుంటే చాలు. వారిలో ఆట పట్ల ఆసక్తిని పెంచడం, ఆడితీరాలనేటట్లు చైతన్యవంతం చేయడం వంటివన్నీ మేమే చూసుకుంటాం.’’ - కె.వి. నాగరాజు, టెన్నిస్ కోచ్ -
సాకేత్ శుభారంభం
ఇండోర్ ఓపెన్ ఇండోర్: ఏటీపీ చాలెంజర్ టోర్నీ ఇండోర్ ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 6-0, 6-2తో దనాయ్ ఉడుమ్‌చోక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. 43 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన సనమ్ సింగ్ సంచలనం సృష్టించాడు. రెండో సీడ్, ప్రపంచ 125వ ర్యాంకర్ అలెగ్జాండర్ కుద్రయెత్సోవ్ (రష్యా)తో జరిగిన తొలి రౌండ్లో 392వ ర్యాంకర్ సనమ్ 7-5, 6-3తో గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్-రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కాజా వినాయక్ శర్మ-విఘ్నేశ్ ద్వయం తొలి రౌండ్లో ఓడిపోయింది. విష్ణు-రామనాథన్ జంట 6-3, 6-1తో శ్రీరామ్ బాలాజీ-రంజిత్ మురుగేశన్ (భారత్) జంటపై నెగ్గగా... వినాయక్-విఘ్నేశ్ జోడీ 6-3, 1-6, 6-10తో సిన్ హాన్ లీ (చైనీస్ తైపీ)-దనాయ్ ఉడుమ్‌చోక్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ-దివిజ్ శరణ్ (భారత్) జంట 6-4, 6-4తో రికార్డో-స్టెఫానో (ఇటలీ) జోడీపై గెలిచింది. -
ఆరడుగుల బుల్లెట్ వైజాగ్ విసిరిన రాకెట్
ఆసియాడ్‌లో సాకేత్‌కు స్వర్ణం విశాఖపట్నం : ‘కృష్ణా జిల్లా వుయ్యూరులో పుట్టాను.. వైజాగ్‌లో పెరిగాను.. ఈ సాగర తీర నగర సౌందర్యం అద్వితీయం. అపురూపం. సహజమైన హార్బర్‌తో అలరారే ఈ నగరం నా టెన్నిస్‌కు ఎంతగానో దోహదపడింది.’ ఆరడుగుల బుల్లెట్ వంటి టెన్నిస్ సంచలన కెరటం సాకేత్ సాయి మైనేని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైజాగ్ గురించి చెప్పిన ఆత్మీయ సంగతులివి.. ఎవరనుకున్నారు విశాఖ కుర్రాడు సాకేత్ ఇంత ఎత్తుకు ఎదుగుతాడని! ఎవరు కలగన్నారు ఈ ఆరడుగుల నాలుగంగుళాల యువకుడు ఇలా దుమ్ము రేపుతాడని! ఆసియాడ్‌లో ఓ స్వర్ణాన్ని , ఓ రజతాన్ని హస్తగతం చేసుకుని ఇంత చరిత్ర సృష్టిస్తాడని! అయితే, కెరీర్ తొలి దినాల్లో నిశ్శబ్దంగా చిరుతలా దూసుకుపోయిన ఈ కుర్రాడి ఆటను చూసిన నిపుణులు అప్పట్లోనే అనుకున్నారు.. ఇతనేదో సాధిస్తాడని! ఏడో తరగతి చదువుతున్నప్పుడు టెన్నిస్ రాకెట్ చేతపట్టి కోచ్ కిషోర్ కనుసన్నల్లో రాటుదేలిన ఈ ప్రతిభావంతుడి ఆట చూసిన వాళ్లు పసిగట్టారు.. ఈ యూత్స్టార్లో మేటి ఆటగాడు దాగున్నాడని! వాళ్ల నమ్మకాన్ని సాకేత్ వమ్ము చేయలేదు.. భారత్‌లోనే నంబర్ టూ ర్యాంకింగ్ ఉన్న ఆటగాడిగా ఎదిగాడు. ఐటీఎఫ్ ప్రో సర్క్యూట్లో ఎనిమిది సింగిల్స్, తొమ్మిది డబుల్స్ టైటిల్స్ సాధించి పాతికేళ్ల ప్రాయంలోనే 300 ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇప్పుడు అమెరికాలో శిక్షణ పొందే స్థాయికి చేరుకున్నాడు. అన్నిటికీ మించి ఆసియాడ్‌లో భారత్‌కు ఓ స్వర్ణాన్ని, రజతాన్ని అందించి విశాఖ ఖ్యాతిని క్రీడాగగనంలో రెపరెపలాడించాడు. తొలి అడుగులివీ.. సర్వీస్ చేయడం నేర్పిన స్థానిక కోచ్ కిషోర్ శిక్షణలో నేర్పు సాధించిన సాకేత్ రాకెట్ పట్టిన రెండేళ్లలోనే స్థానిక కుర్రాళ్లను చిత్తు చేయడం మొదలెట్టాడు. ఆ స్థాయిలో నాకింగ్ చేసేందుకు సమ ఉజ్జీగా నిలిచే ఆటగాళ్లు లేకపోవడంతో మకాం హైదరాబాద్‌కు మార్చాడు. తండ్రి ప్రసాద్ సైతం వ్యాపారరీత్యా విశాఖకు దూరమైనా సర్యూట్స్ టోర్నీలో, తలపడేందుకు సాకేత్‌కు చక్కటి తోడ్పాటునందించాడు. ఏడాదిన్నరగా యూఎస్‌లో శిక్షణ తీసుకుంటూనే ఆసియాడ్‌లో అద్భుతం సాధించాడు. దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తున్న సాకేత్ అటు ఫోర్హాండ్, బ్యాక్ హాండ్ల్లో అదరగొట్టే ప్రతిభ సాధించాడు. బేసిక్స్ విశాఖలో నేర్చుకున్నా... తర్వాత హైదరాబాద్‌లో, ఇప్పుడు యూఎస్‌లో మెలకువలు నేర్చుకుంటున్నాడు. మంత్రి గంటా అభినందనలు టెన్నిస్‌లో బంగారం పతకాన్ని సాధించిన సాకేత్‌కు లాన్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. అసోసియేషన్ తరపునే కాకుండా ప్రభుత్వ పరంగా సాకేత్‌కు అవసరమైన అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా సాకేత్‌కు అభినందనలు తెలిపారు. -
ఐటీఎఫ్ సింగిల్స్ లోనూ మెరిసిన సాకేత్
భీమవరం: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని సింగిల్స్‌లోనూ మెరిశాడు. శనివారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో ఈ వైజాగ్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. డబుల్స్‌లో టైటిల్ నెగ్గిన ఉత్సాహంతో ఉన్న సాకేత్.. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్ 4-6, 6-3, 6-1తో రెండో సీడ్ సనమ్ సింగ్ (భారత్)ను ఓడించాడు. 10 ఏస్‌లతో అదరగొట్టిన సాకేత్ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశాడు. డబుల్స్‌లో తన భాగస్వామిగా ఉన్న సనమ్ సింగ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. మరోవైపు సనమ్ సింగ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. 2012లో ఇదే టోర్నీ ఫైనల్లో సనమ్ సింగ్ చేతిలో మూడు సెట్ల పోరాటంలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న సాకేత్ ఈ ఏడాది మాత్రం అదే వేదికపై, అదే ప్రత్యర్థిని ఓడించి బదులు తీర్చుకోవడం విశేషం. భారత డేవిస్‌కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న సాకేత్ కెరీర్లో ఇది 9వ ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్. -
సాకేత్‌కు తొలి ఏటీపీ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని కెరీర్లో తొలి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. కోల్‌కతాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 6-3, 3-6, 10-4తో విష్ణువర్ధన్-దివిజ్ శరణ్ (భారత్) జోడిపై గెలిచింది. 73 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాకేత్-సనమ్ జంట మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మూడుసార్లు తమ సర్వీస్‌ను కోల్పోయి, మరో మూడుసార్లు తమ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సాకేత్ జోడి పైచేయి సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల చైనీస్ తైపీతో జరిగిన డేవిస్ కప్ పోటీలో భారత్ తరఫున అరంగేట్రం చేసిన 26 ఏళ్ల సాకేత్‌కు కోల్‌కతా ఏటీపీ చాలెంజర్ టోర్నీలో వైల్డ్‌కార్డు ద్వారా మెయిన్ ‘డ్రా’లో చోటు లభించింది. సోమ్‌దేవ్ ఓటమి ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. మూడో సీడ్ ఎవగెని డాన్స్కాయ్ (రష్యా) 3-6, 7-5, 6-2తో సోమ్‌దేవ్‌ను ఓడించి శనివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)తో పోరుకు సిద్ధమయ్యాడు.