క్వార్టర్స్‌లో సాకేత్ | Saket in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్

Published Wed, Oct 26 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

క్వార్టర్స్‌లో సాకేత్

క్వార్టర్స్‌లో సాకేత్

పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, హైదరాబాద్ ఆటగాడు సాకేత్ మైనేని క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సాకేత్ 6-0, 2-6, 6-1తో భారత్‌కే చెందిన సిద్ధార్థ్ రావత్‌ను ఓడించాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో విష్ణువర్ధన్ 4-6, 4-6తో దిమిత్రీ పోప్‌కో (కజకిస్తాన్) చేతిలో, ఐదో సీడ్ రామ్‌కుమార్ రామనాథన్ 2-6, 5-7తో సాడియో డుంబియా (ఫ్రాన్‌‌స) చేతిలో, సుమీత్ నాగల్ 7-6 (7/2), 6-7 (6/8), 4-6తో అడ్రియన్ మెనెన్‌డెజ్ (స్పెరుున్) చేతిలో ఓడిపోయారు.

 
19 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో ఓ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆడుతోన్న లియాండర్ పేస్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో పేస్-రామ్‌కుమార్ ద్వయం 6-3, 6-4తో అన్విత్ బెంద్రే-సిద్ధార్థ్ రావత్ (భారత్) జంటపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్స్‌లో విష్ణువర్ధన్-శ్రీరామ్ బాలాజీ జంట 3-6, 4-6తో పెట్రోవిచ్-మిలోజెవిచ్ (సెర్బియా) జోడీ చేతిలో, మొహిత్-కాజా వినాయక్ శర్మ ద్వయం 2-6, 4-6తో జీవన్-విజయ్ జంట చేతిలో ఓడిపోయారుు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement