సాకేత్ శుభారంభం | saketh good start | Sakshi
Sakshi News home page

సాకేత్ శుభారంభం

Published Tue, Oct 14 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

సాకేత్ శుభారంభం

సాకేత్ శుభారంభం

ఇండోర్ ఓపెన్
 ఇండోర్: ఏటీపీ చాలెంజర్ టోర్నీ ఇండోర్ ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాకేత్ 6-0, 6-2తో దనాయ్ ఉడుమ్‌చోక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. 43 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు.

మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన సనమ్ సింగ్ సంచలనం సృష్టించాడు. రెండో సీడ్, ప్రపంచ 125వ ర్యాంకర్ అలెగ్జాండర్ కుద్రయెత్సోవ్ (రష్యా)తో జరిగిన తొలి రౌండ్‌లో 392వ ర్యాంకర్ సనమ్ 7-5, 6-3తో గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్-రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కాజా వినాయక్ శర్మ-విఘ్నేశ్ ద్వయం తొలి రౌండ్‌లో ఓడిపోయింది.

విష్ణు-రామనాథన్ జంట 6-3, 6-1తో శ్రీరామ్ బాలాజీ-రంజిత్ మురుగేశన్ (భారత్) జంటపై నెగ్గగా... వినాయక్-విఘ్నేశ్ జోడీ 6-3, 1-6, 6-10తో సిన్ హాన్ లీ (చైనీస్ తైపీ)-దనాయ్ ఉడుమ్‌చోక్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ-దివిజ్ శరణ్ (భారత్) జంట 6-4, 6-4తో రికార్డో-స్టెఫానో (ఇటలీ) జోడీపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement