ప్రేమకు మరణం లేదు! | Love is not death! | Sakshi
Sakshi News home page

ప్రేమకు మరణం లేదు!

Published Thu, Jul 23 2015 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

ప్రేమకు మరణం లేదు!

ప్రేమకు మరణం లేదు!

స్వచ్ఛమైన ప్రేమకు మరణం లేదనే కథాంశంతో సువర్ణ సమర్పణలో పవన్‌కుమార్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘కోమలి’. నూతన దర్శకుడు స్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా సవీన్ రాయ్, సాకేత్, కార్తీక్, సాయి క్రిష్ణ, కాజల్, సంజన, కవిత హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.
 
 చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘స్వచ్ఛమైన ప్రేమ గెలవడం ఖాయమని చెప్పే చిత్రం ఇది. అంతర్లీనంగా మంచి సందేశం ఉంది. నిజామాబాద్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కమలాకర్ రావు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడం విశేషం.
 
 నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కబీర్ రఫీ, రచన: సురేష్ జై, ఎడిటింగ్: యాదగిరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement