Brisbane Open
-
2017 తర్వాత మళ్లీ టైటిల్...
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బల్గేరియా టెన్నిస్ స్టార్ దిమిత్రోవ్ తన కెరీర్లో తొమ్మిదో సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 32 ఏళ్ల దిమిత్రోవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 14వ ర్యాంకర్ దిమిత్రోవ్ 7–6 (7/5), 6–4తో 8వ ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి 95,340 డాలర్ల (రూ. 79 లక్షల 30 వేలు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. దిమిత్రోవ్ చివరిసారి 2017 నవంబర్ 17న ఏటీపీ ఫైనల్స్ టోర్నీ టైటిల్ నెగ్గాడు. -
యూకీ బాంబ్రీ జోడీకి చేదు అనుభవం.. సెమీస్‌లోనే నిష్క్రమణ
Brisbane International Semifinals: బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ ప్రయాణం ముగిసింది. శనివారం నాటి పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో లాయిడ్ గ్లాస్‌పూల్(ఇంగ్లండ్)- జీన్ జులెన్ రోజర్(నెదర్లాండ్స్) ద్వయంలో చేతిలో ఈ జంట ఓటమి పాలైంది. ఎనిమిదో సీడ్ యూకీ- రాబిన్ జోడీ... సెకండ్ సీడ్ అయిన ప్రత్యర్థి చేతిలో 3-6, 7-6, 9-11 పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా నలభై నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఏ దశలోనూ లాయిడ్- జీన్ జంటపై యూకీ- రాబిన్ పైచేయి సాధించలేకపోయారు. దీంతో.. సెమీస్‌లోనే వీరు ఇంటిబాట పట్టారు. క్వార్టర్ ఫైనల్లో అలా గెలుపొంది ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ –రాబిన్ ద్వయం 7–6 (7/5), 7–6 (7/5)తో నథానియల్ లామోన్స్–జేక్సన్ విత్రో (అమెరికా) జంటపై విజయం సాధించింది. 96 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకున్నాయి. ఈ క్రమంలో టైబ్రేక్‌లలో యూకీ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. తద్వారా సెమీస్‌లో ప్రవేశించింది. కాగా ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల యూకీ బాంబ్రీ.. గతేడాది మలోర్కా చాంపియన్‌షిప్స్ డబుల్స్ కాంపిటీషన్లో పాల్గొని తొలి ఏటీపీ టైటిల్ గెలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన లాయిడ్ హ్యారిస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. చదవండి: Ind vs Afg: టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్.. కెప్టెన్? -
ఫైనల్లో సానియా జంట
ఫ్లోరిడా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ సీజన్లో రెండో టైటిల్‌పై కన్నేసింది. జనవరిలో బెథానీ మాటెక్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్ గెలిచిన సానియా.. ఇప్పుడు బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి మయామి ఓపెన్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత్–చెక్ జోడీ 6–7 (6/8), 6–1, 10–4తో ఐదోసీడ్ మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)–చాన్ యంగ్ జాన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. ఫైనల్లో గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా)–జు యిఫాన్ (చెనా)లతో సానియా–స్ట్రికోవా పోటీపడతారు. నాదల్ vs ఫెడరర్ ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్) టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. మూడు గంటల పది నిమిషాలు సాగిన సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (11/9), 6–7 (9/11), 7–6 (7/5)తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో నాదల్ 6–1, 7–5తో ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)పై నెగ్గాడు -
మ్యాచ్ గెలిస్తే ర్యాంకు పోతుంది!
బ్రిస్బేన్:ఎవరైనా మ్యాచ్ గెలిస్తే ర్యాంకు మెరుగవుతుంది. మరి ఇక్కడ మ్యాచ్ గెలిస్తే ర్యాంకు పోతుంది. బ్రిస్బేన్ ఓపెన్ లో సానియాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ ఓపెన్ మహిళల డబుల్స్ లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా-బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)లు ఫైనల్ కు చేరారు. ఈ టైటిల్‌ను సానియా-బెథానీ జోడిలు గెలిచిన పక్షంలో వారి వ్యక్తిగత ర్యాంకుల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత 91 వారాలుగా ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా నంబర్ వన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బ్రిస్బేన్ టైటిల్ వేటకు అడుగుదూరంలో సానియా-బెథానీలు నిలవడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ టైటిల్‌ను గెలిచిన పక్షంలో సానియా మీర్జా తన నంబర్ వన్ ర్యాంకును కోల్పోవల్సి ఉంటుంది. అది కూడా భాగస్వామి బెథానీకే. గతేడాది హింగిస్‌తో కలిసి సానియా ఈ టోర్నీ టైటిల్ నెగ్గగా... బెథానీ ఈ టోర్నీలో ఆడలేదు. ప్రస్తుతం సానియా ఖాతాలో 8,135 పాయింట్లు... బెథానీ ఖాతాలో 7,805 పాయింట్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య 330 పాయింట్ల తేడా ఉంది. టైటిల్ గెలిస్తే ఈ జంటకు 470 పాయింట్లు... రన్నరప్‌గా నిలిస్తే 305 పాయింట్లు లభిస్తాయి. గతేడాది సానియా ఈ టైటిల్ నెగ్గినందుకు ఈసారీ విజేతగా నిలిస్తే ఆమె ఖాతాలో అదనంగా పాయింట్లు చేరే అవకాశం లేదు. బెథానీ గత సంవత్సరం ఈ టోర్నీలో ఆడలేదు కాబట్టి ఆమె ఖాతాలో అదనంగా పాయింట్లు వస్తాయి. దాంతో ర్యాంకింగ్స్‌లో మార్పు వస్తుంది. ఒకవేళ టైటిల్ ను గెలిచిన పక్షంలో సానియా ర్యాంకును వదులుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా సైకిల్ సిస్టమ్ పద్దతిలో మరి సానియా మ్యాచ్ ఓడి ర్యాంకును కాపాడుకుంటుందా?లేక టైటిల్ గెలిచి ర్యాంకును నిలబెట్టుకుందా? అనేది మాత్రం ఆసక్తికరం. శనివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా–ఎలీనా వెస్నినా (రష్యా) జోడీతో సానియా ద్వయం తలపడుతుంది. -
టైటిల్ పోరుకు సానియా జంట
బ్రిస్బేన్: కొత్త సీజన్‌ను టైటిల్‌తో ఆరంభించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో విజయం దూరంలో నిలిచింది. బ్రిస్బేన్ ఓపెన్‌లో తన భాగస్వామి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలసి ఈ హైదరాబాదీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా–బెథానీ ద్వయం 6–4, 6–3తో సు వీ సెయి (చైనీస్ తైపీ)–లారా సిగెమండ్ (జర్మనీ) జంటపై గెలిచింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ తమ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా–ఎలీనా వెస్నినా (రష్యా) జోడీతో సానియా ద్వయం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మకరోవా–వెస్నినా 6–1, 6–3తో మూడో సీడ్ కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) –అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)లపై గెలిచారు. టాప్ ర్యాంక్ ఉంటుందా... లేదా! గత 91 వారాలుగా ప్రపంచ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న సానియా మీర్జా బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకుంటే ఆమె పార్ట్‌టైమ్ భాగస్వామి, ప్రస్తుతం ఐదో ర్యాంక్‌లో ఉన్న బెథానీ మాటెక్కు టాప్ ర్యాంక్‌ను కోల్పోతుంది. ఫైనల్లో ఓడిపోతే మాత్రం ఈ హైదరాబాద్ స్టార్ నంబర్‌వన్ ర్యాంక్‌లోనే కొనసాగే అవకాశముంది. గతేడాది హింగిస్‌తో కలిసి సానియా ఈ టోర్నీ టైటిల్ నెగ్గగా... బెథానీ ఈ టోర్నీలో ఆడలేదు. ప్రస్తుతం సానియా ఖాతాలో 8,135 పాయింట్లు... బెథానీ ఖాతాలో 7,805 పాయింట్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య 330 పాయింట్ల తేడా ఉంది. టైటిల్ గెలిస్తే ఈ జంటకు 470 పాయింట్లు... రన్నరప్‌గా నిలిస్తే 305 పాయింట్లు లభిస్తాయి. గతేడాది సానియా ఈ టైటిల్ నెగ్గినందుకు ఈసారీ విజేతగా నిలిస్తే ఆమె ఖాతాలో అదనంగా పాయింట్లు చేరే అవకాశం లేదు. బెథానీ గత సంవత్సరం ఈ టోర్నీలో ఆడలేదు కాబట్టి ఆమె ఖాతాలో అదనంగా పాయింట్లు వస్తాయి. దాంతో ర్యాంకింగ్స్‌లో మార్పు వస్తుంది. -
పాత భాగస్వామితో కొత్త సీజన్
బెథానీతో బ్రిస్బేన్ టోర్నీలో సానియా న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త సీజన్‌ను తన పాత భాగస్వామితో కలిసి మొదలుపెట్టనుంది. జనవరి 1 నుంచి 7 వరకు ఆస్ట్రేలియాలో జరిగే బ్రిస్బేన్ ఓపెన్‌లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా మీర్జా ఆడనుంది. ఈ ఏడాది మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్‌ను సాధించింది. మహిళల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న ఈ హైదరాబాద్ క్రీడాకారిణి గతంలో బెథానీతో కలిసి నాలుగు టోర్నీల్లో విజేతగా నిలిచింది. -
ఫెడరర్... ఫటాఫట్
బ్రిస్బేన్: కొత్త ఏడాదిలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నూతనోత్సాహంతో ఉన్నాడు. గత రెండేళ్లలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా నెగ్గలేకపోయిన ఈ మాజీ నంబర్‌వన్, సీజన్ తొలి టోర్నమెంట్ బ్రిస్బేన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ కేవలం 41 నిమిషాల్లో గెలిచాడు. ప్రత్యర్థికి ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను 6-0, 6-1తో దక్కించుకొని కెరీర్లో 998వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. సెమీఫైనల్లో దిమిత్రోవ్ (బల్గేరియా)తో ఫెడరర్ ఆడతాడు. మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఫెడరర్, ఓపెన్ శకంలో (1968 తర్వాత) 1000 విజ యాలు సాధించిన మూడో క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. -
సానియా జంటకు షాక్
న్యూఢిల్లీ: బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-సు వి సెయి (చైనీస్ తైపీ) జోడీ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా-సు వి సెయి ద్వయం 6-4, 6-7 (1/7), 8-10తో నాలుగో సీడ్ కరోలైన్ గార్సియా (ఫ్రాన్స్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంట చేతిలో ఓడిపోయింది. గంటా 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సానియా జంట నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. అయితే సూపర్ టైబ్రేక్‌లో మాత్రం సానియా జంట తడబడి ఓటమి పాలైంది. సెమీస్‌లో ఓడిన సానియా జోడీకి 13,194 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 22 వేలు)తోపాటు 185 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.