ఫైనల్లో సానియా జంట | Sania Mirza and Barbora Strycova enter women's doubles final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జంట

Published Sun, Apr 2 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

ఫైనల్లో సానియా జంట

ఫైనల్లో సానియా జంట

ఫ్లోరిడా (అమెరికా): భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఈ సీజన్‌లో రెండో టైటిల్‌పై కన్నేసింది. జనవరిలో బెథానీ మాటెక్‌ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్‌ ఓపెన్‌ గెలిచిన సానియా.. ఇప్పుడు బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో కలిసి మయామి ఓపెన్‌ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత్‌–చెక్‌ జోడీ 6–7 (6/8), 6–1, 10–4తో ఐదోసీడ్‌ మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌)–చాన్‌ యంగ్‌ జాన్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచింది. ఫైనల్లో గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా)–జు యిఫాన్‌ (చెనా)లతో సానియా–స్ట్రికోవా పోటీపడతారు.

నాదల్‌ vs ఫెడరర్‌  
ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యారు. మూడు గంటల పది నిమిషాలు సాగిన సెమీఫైనల్లో ఫెడరర్‌ 7–6 (11/9), 6–7 (9/11), 7–6 (7/5)తో నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో నాదల్‌ 6–1, 7–5తో ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ)పై నెగ్గాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement