Bethanie Mattek
-
ఫైనల్లో సానియా జంట
ఫ్లోరిడా (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ సీజన్లో రెండో టైటిల్‌పై కన్నేసింది. జనవరిలో బెథానీ మాటెక్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్ గెలిచిన సానియా.. ఇప్పుడు బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి మయామి ఓపెన్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత్–చెక్ జోడీ 6–7 (6/8), 6–1, 10–4తో ఐదోసీడ్ మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)–చాన్ యంగ్ జాన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. ఫైనల్లో గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా)–జు యిఫాన్ (చెనా)లతో సానియా–స్ట్రికోవా పోటీపడతారు. నాదల్ vs ఫెడరర్ ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్) టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. మూడు గంటల పది నిమిషాలు సాగిన సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (11/9), 6–7 (9/11), 7–6 (7/5)తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. మరో సెమీఫైనల్లో నాదల్ 6–1, 7–5తో ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)పై నెగ్గాడు -
సెమీస్‌లో సానియా జంట
సిడ్నీ: ఏడాదిన్నర తర్వాత తన పాత భాగస్వామి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సిడ్నీ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-బెథానీ ద్వయం 6-3, 6-3తో రెండో సీడ్ మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) జంటపై సంచలన విజయం సాధించింది. చివరిసారి 2013 ఫ్రెంచ్ ఓపెన్‌లో బెథానీతో కలిసి ఆడిన సానియా ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జంట సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో కిమికో డాటె క్రుమ్ (జపాన్)-కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) జోడీతో సానియా ద్వయం తలపడుతుంది. బోపన్న జోడీ కూడా: ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్) నెస్టర్ (కెనడా) జంట కూడా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న-నెస్టర్ 7-5, 6-3తో బొలెలీ-ఫాగ్నిని (ఇటలీ)లపై గెలిచారు. సెమీఫైనల్లో టాప్ సీడ్ జూలియన్ బెనెట్యూ-రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటతో బోపన్న జోడీ ఆడుతుంది.