ఫెడరర్... ఫటాఫట్
బ్రిస్బేన్: కొత్త ఏడాదిలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నూతనోత్సాహంతో ఉన్నాడు. గత రెండేళ్లలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా నెగ్గలేకపోయిన ఈ మాజీ నంబర్‌వన్, సీజన్ తొలి టోర్నమెంట్ బ్రిస్బేన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ కేవలం 41 నిమిషాల్లో గెలిచాడు.
ప్రత్యర్థికి ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను 6-0, 6-1తో దక్కించుకొని కెరీర్‌లో 998వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. సెమీఫైనల్లో దిమిత్రోవ్ (బల్గేరియా)తో ఫెడరర్ ఆడతాడు. మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఫెడరర్, ఓపెన్ శకంలో (1968 తర్వాత) 1000 విజ యాలు సాధించిన మూడో క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు.