![Saketh Myneni And Vinayak Loses The ATP Challenger Tournament - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/14/SKAETH.jpg.webp?itok=ipyzVxAI)
పుణే: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, కాజా వినాయక్ శర్మతోపాటు హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ కథ ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాకేత్ మైనేని 6–3, 5–7, 4–6తో ఎర్గిల్ కిర్కిన్ (టర్కీ) చేతిలో... వినాయక్ శర్మ 2–6, 1–6తో సెమ్ ఇల్కెల్ (టర్కీ) చేతిలో... అనిరుధ్ 3–6, 2–6తో రొబెర్టో ఒల్మెడో (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్, శశికుమార్ ముకుంద్ రెండో రౌండ్‌లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment