
సాక్షి, హైదరాబాద్: కున్‌మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. చైనాలోని ఆనింగ్ నగరంలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సాకేత్ 2–6, 4–6తో భారత్‌కే చెందిన రెండో సీడ్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ చేతిలో ఓడిపోయాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
ప్రత్యర్థి సర్వీస్‌ను ఒక్కసారి కూడా బ్రేక్ చేయలేకపోయిన సాకేత్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) 6–4, 6–4తో యాన్ బాయ్ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
Comments
Please login to add a commentAdd a comment