Qatar Open Tournament
-
సెమీఫైనల్లో రోహన్ బోపన్న జోడీ
ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దోహాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 1–6, 6–4, 11–9తో భారత్‌కే చెందిన సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. సాకేత్–యూకీలకు 12,750 డాలర్ల (రూ. 10 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Qatar Open: రన్నరప్ బోపన్న–షపోవలోవ్ జోడీ
Qatar Open: ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. దోహాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జోడీ 6–7 (4/7), 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–షపోవలోవ్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–షపోవలోవ్ జోడీకి 29,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 21 లక్షల 80 వేలు) లభించింది. ఫైనల్లో సాకేత్ జంట సాక్షి, హైదరాబాద్: బెంగళూరు ఓపెన్–2 ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తన భాగస్వామి రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బెంగళూరులో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 7–6 (7/3)తో కుకావుడ్ (ఫ్రాన్స్)–ఆండ్రూ హారిస్ (ఆ్రస్టేలియా) జోడీపై గెలిచింది. మరో సెమీఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 4–6, 6–4, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో అర్జున్ ఖడే (భారత్)–ఎర్లెర్ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్‌కు కూడా డౌటే.. ఎందుకంటే! -
సానియా జంటకు నిరాశ
దోహా: తన భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి ఈ ఏడాది రెండో టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఖతర్ ఓపెన్ టోర్నమెంట్లో ఈ ఇండో–చెక్ జంట సెమీఫైనల్లో ఓడిపోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్ సానియా–స్ట్రికోవా ద్వయం 3–6, 6–1, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)–కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి ద్వయం సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సానియా–స్ట్రికోవా తడబడి మూల్యం చెల్లించుకున్నారు. సెమీస్‌లో ఓడిన సానియా జంటకు 12,120 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 13 వేలు)తోపాటు 185 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.