సానియా జంటకు నిరాశ | Sania Mirza-Barbora Strycova knocked out of Qatar Open in semifinals | Sakshi
Sakshi News home page

సానియా జంటకు నిరాశ

Published Sun, Feb 19 2017 1:28 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

సానియా జంటకు నిరాశ

సానియా జంటకు నిరాశ

దోహా: తన భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో కలిసి ఈ ఏడాది రెండో టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఖతర్‌ ఓపెన్  టోర్నమెంట్‌లో ఈ ఇండో–చెక్‌ జంట సెమీఫైనల్లో ఓడిపోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్‌ సానియా–స్ట్రికోవా ద్వయం 3–6, 6–1, 8–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో నాలుగో సీడ్‌ అబిగెయిల్‌ స్పియర్స్‌ (అమెరికా)–కాటరీనా స్రెబోత్నిక్‌ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.

69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి ద్వయం సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. అయితే నిర్ణాయక సూపర్‌ టైబ్రేక్‌లో సానియా–స్ట్రికోవా తడబడి మూల్యం చెల్లించుకున్నారు. సెమీస్‌లో ఓడిన సానియా జంటకు 12,120 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 13 వేలు)తోపాటు 185 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement