barbara strikova
-
బార్బరా స్ట్రికోవాకు సానియా బై బై
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో కొత్త భాగస్వామిని ఎంచుకుంది. ఎనిమిది నెలలుగా బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కొనసాగిస్తున్న భాగస్వామ్యానికి సానియా ముగింపు పలికింది. ఈ నెలాఖర్లో మొదలయ్యే క్లే కోర్టు సీజన్లో తన కొత్త భాగస్వామి యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)తో కలిసి సానియా ఆడనుంది. 29 ఏళ్ల ష్వెదోవా 2010లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్‌ను గెలిచింది. స్ట్రికోవా డబుల్స్ విభాగం కాకుండా సింగిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో... ఆమెతో విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నామని సానియా తండ్రి, కోచ్ అయిన ఇమ్రాన్ మీర్జా తెలిపారు. సానియా–స్ట్రికోవా జంట రెండు టైటిల్స్ నెగ్గి, మూడు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచింది. -
క్వార్టర్స్‌లో సానియా జంట
కాలిఫోర్నియా: మరో అలవోక విజయంతో ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా–బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ సానియా–స్ట్రికోవా ద్వయం 6–2, 6–3తో సారా ఎరాని (ఇటలీ)–అలీసా రొసోల్‌స్కా (పోలాండ్) జోడీపై గెలిచింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–చెక్ జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఎరాని–రొసోల్‌స్కా జంట మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)–మారియా జోస్ మార్టినెజ్ (స్పెయిన్); మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)–యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)ల మధ్య జరిగే రెండో రౌండ్ మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో సానియా జంట తలపడుతుంది. -
సానియా జంటకు మళ్లీ నిరాశ
దుబాయ్: వరుసగా రెండో టోర్నమెంట్లోనూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. తన భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొన్న సానియా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సానియా–స్ట్రికోవా ద్వయం 4–6, 3–6తో రెండో సీడ్ మకరోవా–వెస్నినా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో నిష్క్రమించిన సానియా జంటకు 34,880 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 23 లక్షల 23 వేలు)తోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతవారం ఖతర్ టోర్నీలోనూ సానియా–స్ట్రికోవా జోడీ సెమీస్‌లోనే ఓడిపోయింది. -
సానియా జంటకు నిరాశ
దోహా: తన భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి ఈ ఏడాది రెండో టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఖతర్ ఓపెన్ టోర్నమెంట్లో ఈ ఇండో–చెక్ జంట సెమీఫైనల్లో ఓడిపోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్ సానియా–స్ట్రికోవా ద్వయం 3–6, 6–1, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)–కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి ద్వయం సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సానియా–స్ట్రికోవా తడబడి మూల్యం చెల్లించుకున్నారు. సెమీస్‌లో ఓడిన సానియా జంటకు 12,120 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 13 వేలు)తోపాటు 185 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫెడరర్ అలవోకగా...
ఏడాదిలో మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఐదో రోజు ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు.అగ్రశ్రేణి ఆటగాళ్లు ముర్రే, ఫెడరర్ అంచనాలకు అనుగుణంగా సునాయాసంగా నాలుగో రౌండ్లోకి ప్రవేశించగా, ముగురుజ, వీనస్ విలియమ్స్ కూడా ముందంజ వేశారు. భారత్‌కు సంబంధించి సానియా దూసుకుపోగా, బొపన్న పురుషుల డబుల్స్ నుంచి నిష్క్రమించాడు. మెల్బోర్న్: కెరీర్లో తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ వేటలో ఉన్న వరల్డ్ నంబర్న్ ఆండీ ముర్రే (బ్రిటన్) కీలక పోరులో సత్తా చాటి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ముర్రే 6–4, 6–2, 6–4తో స్యామ్ క్వారీ (అమెరికా)ను చిత్తు చేశాడు. 31వ సీడ్ క్వారీని గత ఏడాది వింబుల్డన్ లో జొకోవిచ్‌ను ఓడించిన రికార్డు ఉంది. తాజాగా జొకొవిచ్ కూడా రెండో రౌండ్లోనే ఓడిపోవడంతో మరో సంచలనపై అందరి దృష్టి నిలిచింది. కానీ ముర్రే వాటిని పటాపంచలు చేస్తూ అలవోక విజయం అందుకున్నాడు. రెండు గంటల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్, 17వ సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–2, 6–4, 6–4 తేడాతో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై ఘన విజయం సాధించాడు. గంటన్నరలోనే ముగిసిన ఈ పోరులో ఫెడరర్ ఎనిమిది ఏస్‌లు కొట్టాడు. పురుషుల సింగిల్స్‌లో ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌లలో నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 3–6, 6–2, 6–2, 7–6 (7)తో విక్టర్ ట్రోయ్కీ (సెర్బియా)పై, నిషికొరి (జపాన్ 6–4, 6–4, 6–4తో ల్యూ కాస్ లాకో (స్లొవేకియా)పై గెలుపొందారు. కెర్బర్ దూకుడు... మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ) జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్లో ఆమె 6–0, 6–4తో ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఏడో సీడ్, స్పెయిన్ కు చెందిన గాబ్రియెలా ముగురుజా కూడా సునాయాసంగా ముందంజ వేసింది. మూడో రౌండ్లో ఆమె 6–4, 6–2తో సెవస్తొవా (లాత్వియా)ను ఓడించింది. అమెరికా స్టార్ వీనస్ కూడా నాలుగో రౌండ్లోకి అడుగు పెట్టింది. ఆమె 6–1, 6–0తో అతి సునాయాసంగా యింగ్ డువాన్(చైనా)ను చిత్తుగా ఓడించింది. ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా(రష్యా) 6–4, 5–7, 9–7తో జెలెనా జంకోవిచ్(సెర్బియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్ చేరింది. ముర్రే, వావ్రింకా కూడా ముగురుజ, వీనస్ ముందంజ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరో తీవ్ర సంఘటన జరిగింది. ఈఎస్పీఎన్ తరఫున టీవీ కామెంటరీ చేస్తున్న వ్యాఖ్యాత డౌగ్ ఆల్టర్ అమెరికా స్టార్ క్రీడాకారిణి వీనస్‌ను ‘గొరిల్లా’ అంటూ సంబోధించాడు. దాంతో ఆగ్రహం చెందిన ప్రసారకర్తలు అతడిని వెంటనే తప్పించారు. అయితే తాను ఆ పదాన్ని పలికే తీరులో తప్పు చేశానని, తన ఉద్దేశం అది కాదంటూ అతను వివరణ ఇస్తూ క్షమాపణ కోరా డు. వీనస్ రెండో రౌండ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2017లోనూ విలియమ్స్ సిస్టర్స్ పై తీవ్ర వ్యాఖ్యలు ఆగడం లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దూసుకుపోతున్న సానియా జోడి మహిళల డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్ సానియా మీర్జా (భారత్), బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడి సునాయాసంగా ముందంజ వేసింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా, స్ట్రికోవా 6–1, 6–4తో సమంతా స్టొసర్ (ఆస్ట్రేలియా), షుయి జాంగ్ (చైనా) జంటను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. గంటా 21 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. అయితే పురుషుల డబుల్స్‌లో మాత్రం భారత ఆటగాడు రోహన్ బొపన్నకు నిరాశే ఎదురైంది. 15వ సీడ్ బొపన్న–పాబ్లో క్వాస్ (ఉరుగ్వే) ద్వయం రెండో రౌండ్లో 6–2, 6–7 (2), 4–6 స్కోరుతో ఆస్ట్రేలియా జంట అలెక్స్ బోల్ట్, బ్రాడ్లీ మౌస్లీ చేతిలో పరాజయం పాలైంది. అయితే తన ఓటమికి అంపైరింగ్ నిర్ణయాలే కారణమని బొపన్న మ్యాచ్ అనంతరం తీవ్రంగా విమర్శించాడు. కీలక సమయంలో వివాదాస్పద రీతిలో పాయింట్ ఇవ్వడమే తమను ఓడించిందని బొపన్న, క్వాస్ ద్వయం వ్యాఖ్యానించింది. వీరిద్దరు దీనిపై చెయిర్ అంపైర్‌తోనే వాగ్వాదానికి కూడా దిగారు. ‘రిఫరీ మ్యాచ్ ఫలితాన్ని శాసించడం జీర్చించుకోలేకపోతున్నాను’ అంటూ ఆ తర్వాత బొపన్న ట్వీట్ చేశాడు. -
సెమీస్‌లో సానియా జంట
సిడ్నీ: ఈ ఏడాది ఆడుతోన్న రెండో టోర్నమెంట్లోనూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగిస్తోంది. తన రెగ్యులర్ భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి సిడ్నీ ఓపెన్‌లో బరిలోకి దిగిన సానియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–బార్బరా ద్వయం 6–3, 6–4తో మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)–అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది. టాప్ సీడ్ హోదాలో ఆడుతున్న సానియా–బార్బరా తొలి రౌండ్లో 5–7, 6–1, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో హలవకోవా (చెక్ రిపబ్లిక్)–షుయె పెంగ్ (చైనా)పై కష్టపడి గెలిచారు. గురువారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ వానియా కింగ్ (అమెరికా)–యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటతో సానియా–బార్బరా ద్వయం తలపడుతుంది. గతవారం సానియా తన పార్ట్‌టైమ్ భాగస్వామి బెథానీ మాటెక్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న సంగతి విదితమే. టాప్ సీడ్ జోడీకి పేస్ జంట షాక్ మరోవైపు న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఆక్లాండ్ ఓపెన్‌లో లియాండర్ పేస్ (భారత్)–ఆండ్రీ సా (బ్రెజిల్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి రౌండ్లో పేస్–ఆండ్రీ సా జోడీ 7–6 (7/3), 6–3తో టాప్ సీడ్ ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)–మాక్స్ మిర్నీ (బెలారస్) జంటపై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఈ ఇండో–బ్రెజిలియన్ జోడీ మార్కస్ డానియెల్ (న్యూజిలాండ్)–మార్సెలో డెలోలైనర్ (బ్రెజిల్)లతో ఆడుతుంది. బోపన్న ద్వయం ఓటమి సిడ్నీ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జంటకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బోపన్న–క్యువాస్ 6–7 (5/7), 7–6 (7/4), 9–11తో ‘సూపర్ టైబ్రేక్’లో మాయెర్–పెట్ష్నెర్ (జర్మనీ) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
సానియా జంటకు షాక్
న్యూఢిల్లీ: చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంటకు చుక్కెదురైంది. చైనాలోని బీజింగ్ నగరంలో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ సానియా-స్ట్రికోవా ద్వయం 6-4, 1-6, 4-10తో గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా)-మరియా జోస్ శాంచెజ్ (స్పెరుున్) జంట చేతిలో ఓడిపోరుుంది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోరుుంది.