బార్బరా స్ట్రికోవాకు సానియా బై బై | Sania Mirza quits partnership with Barbora | Sakshi
Sakshi News home page

బార్బరా స్ట్రికోవాకు సానియా బై బై

Published Tue, Apr 11 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

బార్బరా స్ట్రికోవాకు సానియా బై బై

బార్బరా స్ట్రికోవాకు సానియా బై బై

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో కొత్త భాగస్వామిని ఎంచుకుంది. ఎనిమిది నెలలుగా బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో కొనసాగిస్తున్న భాగస్వామ్యానికి సానియా ముగింపు పలికింది. ఈ నెలాఖర్లో మొదలయ్యే క్లే కోర్టు సీజన్‌లో తన కొత్త భాగస్వామి యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్‌)తో కలిసి సానియా ఆడనుంది. 29 ఏళ్ల ష్వెదోవా 2010లో వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్స్‌ను గెలిచింది.

స్ట్రికోవా డబుల్స్‌ విభాగం కాకుండా సింగిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో... ఆమెతో విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నామని సానియా తండ్రి, కోచ్‌ అయిన ఇమ్రాన్‌ మీర్జా తెలిపారు. సానియా–స్ట్రికోవా జంట రెండు టైటిల్స్‌ నెగ్గి, మూడు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement