సెమీస్‌లో శివాని
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి శివాని అమినేని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని ‘శాట్స్’ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అండర్–18 బాలికల సింగిల్స్‌లో శివాని అమినేని 6–4, 6–1తో శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో శివాని 3–6, 7–5, 6–1తో షేక్ హుమేరాను ఓడించింది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో తనీషా కశ్యప్ 6–2, 6–2తో శివాని మంజనపై, ఆకాంక్ష 7–5, 6–4తో ప్రింకెల్ సింగ్‌పై, శివాని స్వరూప్ 6–4, 6–3తో సల్సా అహర్‌పై గెలుపొందారు.
బాలుర క్వార్టర్స్ ఫలితాలు
అభిమన్యు 6–0, 3–6, 6–3తో కార్తీక్‌రెడ్డి గంటాపై, సచిత్ శర్మ 6–1, 6–4తో ఫ్రాన్సెస్కో బొనాసియా (ఇటలీ)పై, మేఘ్ భార్గవ్ పటేల్ 6–2, 6–1తో నిఖిత్ రెడ్డిపై, కరణ్ శ్రీవాస్తవ 6–7 (2), 6–4, 6–2తో దేవ్ జావియాపై నెగ్గారు.