సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జింబాబ్వే ఎఫ్–1 ఫ్యూచర్స్ పురుషుల టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు అనిరుధ్ చంద్రశేఖర్– విఘ్నేశ్ పెరణమల్లూర్ జంటకు నిరాశ ఎదురైంది. జింబాబ్వేలో జరిగిన ఈ టోర్నీలో ఈ జోడీ ఫైనల్లో పరాజయం పాలై టైటిల్‌ను కోల్పోయింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అనిరుధ్–విఘ్నేశ్ (భారత్) జంట 3–6, 0–6తో టాప్ సీడ్ బెంజమిన్ లాక్–కాట్నీ జాన్ లాక్ (జింబాబ్వే) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
మరోవైపు సింగిల్స్ విభాగంలో అనిరుధ్ రెండోరౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో అనిరుధ్ (భారత్) 4–6, 2–6తో ఆరోన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓటమి చవిచూశాడు. అంతకుముందు తొలిరౌండ్‌లో అనిరుధ్ 6–0, 7–6 (7/5)తో వాసిలియోస్ కారిపి (రష్యా)పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment