హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, రోహన్ కుమార్ శుభారంభం చేశారు. కొంపల్లిలో సోమవారం జరిగిన అండర్–16 బాలుర సింగిల్స్ తొలిరౌండ్‌లో రోహన్ (తెలంగాణ) 6–1, 6–4తో కుశ్ ఆర్జీ రాయ్ (మధ్యప్రదేశ్)పై గెలుపొందాడు. అండర్–18 బాలికల విభాగంలో సంజన సిరిమల్ల (తెలంగాణ) 6–2, 6–1తో రేచల్ ఏంజిల్స్ (తెలంగాణ)పై నెగ్గింది.
ఇతర బాలుర మ్యాచ్‌ల్లో ప్రసాద్ ఇంగ్లే (మహారాష్ట్ర) 6–1, 6–1తో మోహిత్ సాయిచరణ్ రెడ్డి (తెలంగాణ)పై, హితేశ్ (తెలంగాణ) 6–1, 6–0తో అనీశ్ రెడ్డి (తెలంగాణ)పై, సిద్ధార్థ్ (మహారాష్ట్ర) 6–3, 6–1తో రత్నవ్ (తెలంగాణ) పై గెలుపొందారు. బాలికల మ్యాచ్‌ల్లో చరిత (తెలంగాణ) 6–3, 6–3తో శ్రేష్ట (తెలంగాణ)పై, అనీష (ఆంధ్రప్రదేశ్) 6–3, 7–6తో రాధిక మహాజన్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment