సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, వేదరాజు ప్రపూర్ణ ఫైనల్‌కు చేరారు. అజీజ్‌నగర్‌లోని లేక్‌వ్యూ టెన్నిస్ అకాడమీలో గురువారం జరిగిన అండర్–16 బాలికల సింగిల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ సంజన 2–6, 7–6, 6–1తో రేష్మ (కర్నాటక)పై గెలుపొందగా, ప్రపూర్ణ 6–3, 1–6, 6–3తో యానా ధమిజ (హరియాణా)ను ఓడించాడు.
డబుల్స్ విభాగంలో రెండోసీడ్ అదితి ఆరే (తెలంగాణ)– పావని పాథక్ (మహారాష్ట్ర) జంట 6–1, 6–2తో హర్షాలి– భూమిక (మహారాష్ట్ర) జోడీపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు అండర్–14 విభాగంలో ఏపీకి చెందిన అనంత్ మణి తుదిపోరుకు అర్హత సాధించాడు. బాలుర సింగిల్స్ సెమీస్‌లో అనంత్ (ఏపీ) 4–6, 6–2, 6–3తో మోనిల్ లోట్లికార్ (కర్నాటక)ను ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment