
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెన్నిస్ ఆటగాడు తీర్థ శశాంక్ ఆసియా టెన్నిస్ టూర్ పురుషుల అంతర్జాతీయ టోర్నమెంట్‌లో సత్తాచాటుకున్నాడు. ముంబైలో జరుగుతున్న ఈ టోర్నీలో అతను ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోరులో తీర్థ శశాంక్ 3–6, 6–4, 7–5తో తొమ్మిదో సీడ్ అన్విత్ బెంద్రేపై విజయం సాధించాడు.
మిగతా మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు చెందిన పట్లోళ్ల అపురూప్ రెడ్డి 7–5, 6–1తో కరణ్ లాల్‌చందానిపై గెలిచాడు. అయితే తాహ కపాడియాకు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. అతను 4–6, 3–6తో సాహిల్ గవారే చేతిలో పరాజయం పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment