sashank
-
సెమీస్‌లో శశాంక్
సాక్షి, హైదరాబాద్: ఆసియా టెన్నిస్ టూర్ ర్యాంకింగ్ పురుషుల టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. ముంబై వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో మాచెర్ల తీర్థ శశాంక్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో శశాంక్ 1–6, 7–6 (8/6), 6–2తో నాలుగో సీడ్ చంద్రిల్ సూద్‌పై విజయం సాధించాడు. తొలి సెట్లో ప్రత్యర్థికి తేలిగ్గా తలొంచిన శశాంక్ రెండో సెట్లో అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. పాయింట్ పాయింట్‌కు పోరాడి టైబ్రేక్‌లో రెండో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. అదే ఉత్సాహంతో మూడో సెట్‌ను కైవసం చేసుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ఇక్బాల్‌తో శశాంక్ తలపడతాడు. -
క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్
సాక్షి, హైదరాబాద్: ఆసియా టెన్నిస్ టూర్ ఇంటర్నేషనల్ పురుషుల టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుడు తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. ముంబైలో జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ (భారత్) 2–6, 6–2, 6–4తో ఐదో సీడ్ తేజస్ (భారత్)పై విజయం సాధించి ముందంజ వేశాడు. తొలి సెట్లో వెనుకబడిన తీర్థ శశాంక్ రెండో సెట్లో పుంజుకొని సెట్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్లో పోటీ ఎదురైనప్పటికీ శశాంక్ 6–4తో సెట్‌ను గెలుచుకొని టైటిల్ రేసులో నిలిచాడు. మరోవైపు పట్లోళ్ల అపురూప్ రెడ్డి ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. ఎనిమిదో సీడ్ అపురూప్ 4–6, 1–6తో రాఘవ్ జైసింఘాని చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. -
ప్రిక్వార్టర్స్‌లో శశాంక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెన్నిస్ ఆటగాడు తీర్థ శశాంక్ ఆసియా టెన్నిస్ టూర్ పురుషుల అంతర్జాతీయ టోర్నమెంట్లో సత్తాచాటుకున్నాడు. ముంబైలో జరుగుతున్న ఈ టోర్నీలో అతను ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోరులో తీర్థ శశాంక్ 3–6, 6–4, 7–5తో తొమ్మిదో సీడ్ అన్విత్ బెంద్రేపై విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు చెందిన పట్లోళ్ల అపురూప్ రెడ్డి 7–5, 6–1తో కరణ్ లాల్చందానిపై గెలిచాడు. అయితే తాహ కపాడియాకు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. అతను 4–6, 3–6తో సాహిల్ గవారే చేతిలో పరాజయం పాలయ్యాడు. -
సెమీస్‌లో శశాంక్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన శశాంక్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–4, 6–4తో గుహన్ రాజన్ (తమిళనాడు)పై విజయం సాధించాడు. నేడు జరుగనున్న సెమీస్‌లో టాప్ సీడ్ పీసీ విఘ్నేశ్‌తో శశాంక్ ఆడతాడు. -
శశాంక్.. సందేశాల చిత్రం
పొట్టి చిత్రాలు తీయడంలో మన సిటీ కుర్రాళ్లు దిట్టలు. సృజనాత్మకతకు పెట్టింది పేరు మనవాళ్లు. ఎంతగా అంటే.. సమాజాన్ని మొత్తం చుట్టేసి పది నిమిషాల నిడివిలో బంధించగలరు. అందులో ఎంతో విషయం ఉంటుంది. ఎందరినో మేల్కొలిపే జ్ఞానం ఉంటుంది. చాలామంది స్నేహం, ప్రేమ, బంధాలు.. కాలేజీ లైఫ్.. ఇలా యువతను ఆకట్టుకునే లఘు చిత్రాలను తీస్తుంటే కొందరు మాత్రం అందుకు భిన్నం అంటున్నారు. అలాంటివారిలో ‘శశాంక్ రామానుజపురం’ ఒకడు. ఇతడు మాత్రం సమాజంలో మార్పు తీసుకొచ్చే కథాంశాలతో పొట్టి చిత్రాలను రూపొందించి అందరిచేతా ఔరా అనిపించుకుంటున్నాడు. సాక్షి, సిటీబ్యూరో: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో పాల్గొనేందుకు బాలకార్మికుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ‘చైల్డ్ లేబర్’ ఫిలిం తీశాడు శశాంక్. లంచగొండితనంపై తీసిన ‘మార్పు’ చిత్రాన్ని చూసిన దర్శకుడు రాజమౌళి సైతం ఫిదా అయ్యారు. అంతేకాదు.. ఆ చిత్రానికి ‘బెస్ట్ షార్ట్‌ఫిల్మ్’ అవార్డును అందించారు. గోమాతను పూజించాలన్న థీమ్‌తో తీసిన ‘గోపురం’ షార్ట్‌ఫిల్మ్‌కు చిన్నజీయర్ స్వామి నుంచి కూడా అవార్డు అందుకున్నాడు. ఇలా ఇప్పటి వరకు శశాంక్ 24 షార్ట్ఫిలిమ్స్ తీశాడు. అవన్నీ సందేశాత్మక చిత్రాలే కావడం విశేషం. ‘బ్యూటీఫుల్ లైఫ్’గా సాగాలి.. మనది అందమైన జీవితం. అది ఎంతో విలువైంది. కళాశాల చదువుల్లో వేసే తప్పటడుగుల వల్ల ఎంతో మంది యువత రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాస్తున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ మరణాన్ని కొనితెచ్చుకుంటున్నారు. కన్నవారికి శోకం మిగిలిస్తున్నారు. ఇటీవల మాదక ద్రవ్యాలకు కూడా బానిసై యువత భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. దీనిపై యువతలో మార్పు తెచ్చేందుకు శశాంక్ ‘బ్యూటీఫుల్ లైఫ్’ షార్ట్‌ఫిలిం తీశాడు. దానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మద్ధతు పలికారు. మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలు.. తల్లిదండ్రులకు మిగులుస్తున్న శోకం గురించి షార్ట్‌ఫిల్మ్ ద్వారా అందరికీ కన్నీళ్లు తెప్పించిన ఈ కుర్రాడు ఏకంగా ఉత్తమ సందేశాత్మక ఓరియంటెడ్ షార్ట్ఫిల్మ్గా జాతీయస్థాయి అవార్డును దక్కించుకున్నాడు. అంతేకాదు.. ఈ చిత్రాన్ని సినిమా థియేటర్లలో ప్రచారం చిత్రంగా ప్రదర్శిస్తున్నారు. డ్రగ్స్‌పై జాగృతి కల్పించేలా.. సాధారణంగా డ్రగ్స్‌కు నగర యువతే ఎక్కువగా అలవాటు పడతారని చాలామంది అపోహ. ఈ ప్రభావం పల్లెలపై ఎలా పడుతుందో చూపిస్తూ రాచకొండ పోలీసుల సహాకారంతో ‘మరో లోకం’ తీశాడు శశాంక్. సినీనటులు సన, సమీర్ ఈ చిత్రంలో నటించి యువతకు విలువైన సందేశం ఇచ్చే పాత్రలను పోషించారు. జనవరి నెలాఖరు నాటికి ఈ షార్ట్‌ఫిల్మ్‌ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ చేతుల మీదుగా విడదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. మార్పు తేవాలన్నదే తపన.. నేను పుట్టింది వరంగల్‌లో. చదువు అంతా హైదరాబాద్‌లోనే సాగింది. బీకామ్ కంప్యూటర్స్ చేశా. చిన్నప్పటి నుంచి సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించేవాణ్ని. నాన్న వ్యాస్ ఇచ్చిన ప్రోత్సాహంతో ‘మిస్టర్ మేధావి, డార్లింగ్’ చిత్రాల్లో నటించా. అదే సమయంలో నాలో ఉన్న సామాజిక అంశాలను షార్ట్‌ఫిల్మ్ ద్వారా ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనతో ‘చైల్డ్ లేబర్స్’ తొలి షార్ట్‌ఫిల్మ్ తీశా. ఆ తర్వాత సమాజంలో వేళ్లూనుకున్న లంచగొండితనం ఆపడం కుటుంబం నుంచే మొదలుకావాలన్న అంశంతో ‘మార్పు’ తీశా. రక్తదానంపై అవగాహన కలిగించేందుకు ‘రీ బర్త్’ లఘుచిత్రానికి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో వరల్డ్ వైడ్లో టాప్ 100లో చోటు దక్కించుకుంది. డ్రంకన్ డ్రైవ్‌పై అవగాహన కలిగించేలా తీసిన ‘బ్యూటీఫుల్ లైఫ్’ నాకు ఎంతో పేరు తెచ్చింది. ఇప్పుడు కూడా రాచకొండ పోలీసుల సహాకారంతో ‘మరో లోకం’ తీశా. యువత మాదకద్రవ్యాలకు బానిసవుతున్న ఇందులో చూపించా. -
శశాంక్‌కు మిశ్రమ ఫలితాలు
ఐటీఎఫ్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్– 5 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు మాచెర్ల తీర్థ శశాంక్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నేపాల్‌లోని ఖట్మాండులో జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్ సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరగా... డబుల్స్ విభాగంలో క్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగిన బాలుర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో తీర్థ శశాంక్ 6–3, 7–5తో మిచెల్ వోజ్నాక్ (పొలాండ్)పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. మరోవైపు డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో శశాంక్– కబీర్ మన్రాయ్ (భారత్) ద్వయం 4–6, 4–6తో భారత్‌కే చెందిన పీయూశ్ సలేకర్ – ఆదిత్య అయ్యర్ జంట చేతిలో ఓటమి పాలైంది. -
శశాంక్–రిత్విక్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్లో తీర్థ శశాంక్ జోడి సత్తా చాటింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన బాలుర డబుల్స్ ఫైనల్లో శశాంక్–రిత్విక్ చౌదరీ ద్వయం 6–3, 4–6, 10–7తో భార్గవ్ పటేల్–అథర్వ శర్మ జంటపై నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు సింగిల్స్ విభాగంలో శశాంక్ పోరాటం ముగిసింది. సెమీస్ మ్యాచ్‌లో శశాంక్ 3–6, 7–6, 3–6తో తో కరణ్ శ్రీవాస్తవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. బాలికల విభాగంలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ఫైనల్‌కు చేరుకుంది. బాలికల సింగిల్స్ తొలి సెమీస్ మ్యాచ్‌లో రష్మిక 6–3, 6–3తో శివాని ఇంగ్లేపై గెలుపొందగా... మరో మ్యాచ్‌లో తనీషా కశ్యప్ 3–6, 7–6, 6–0తో వినీతను ఓడించింది.