శశాంక్‌–రిత్విక్‌ జోడీకి టైటిల్‌ | sashank-ritwik pair got title | Sakshi
Sakshi News home page

శశాంక్‌–రిత్విక్‌ జోడీకి టైటిల్‌

Published Sat, Jan 28 2017 10:33 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

శశాంక్‌–రిత్విక్‌ జోడీకి టైటిల్‌

శశాంక్‌–రిత్విక్‌ జోడీకి టైటిల్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ ఫెడరేషన్‌ (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌–5 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తీర్థ శశాంక్‌ జోడి సత్తా చాటింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన బాలుర డబుల్స్‌ ఫైనల్లో శశాంక్‌–రిత్విక్‌ చౌదరీ ద్వయం 6–3, 4–6, 10–7తో భార్గవ్‌ పటేల్‌–అథర్వ శర్మ జంటపై నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

 

మరోవైపు సింగిల్స్‌ విభాగంలో శశాంక్‌ పోరాటం ముగిసింది. సెమీస్‌ మ్యాచ్‌లో శశాంక్‌ 3–6, 7–6, 3–6తో తో కరణ్‌ శ్రీవాస్తవ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. బాలికల విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ఫైనల్‌కు చేరుకుంది. బాలికల సింగిల్స్‌ తొలి సెమీస్‌ మ్యాచ్‌లో రష్మిక 6–3, 6–3తో శివాని ఇంగ్లేపై గెలుపొందగా... మరో మ్యాచ్‌లో తనీషా కశ్యప్‌ 3–6, 7–6, 6–0తో వినీతను ఓడించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement