
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల టోర్నమెంట్‌లో తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన శశాంక్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–4, 6–4తో గుహన్ రాజన్ (తమిళనాడు)పై విజయం సాధించాడు. నేడు జరుగనున్న సెమీస్‌లో టాప్ సీడ్ పీసీ విఘ్నేశ్‌తో శశాంక్ ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment