AITA tennis championship
-
సెమీస్‌లో శశాంక్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన శశాంక్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–4, 6–4తో గుహన్ రాజన్ (తమిళనాడు)పై విజయం సాధించాడు. నేడు జరుగనున్న సెమీస్‌లో టాప్ సీడ్ పీసీ విఘ్నేశ్‌తో శశాంక్ ఆడతాడు. -
ఫైనల్లో హర్షసాయి
సాక్షి, హైదరాబాద్: ఎం.పి.ప్రకాశ్ స్మారక ఏఐటీఏ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన క్రీడాకారిణి చల్లా హర్షసాయి ఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మరో తెలుగమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్లో పరాజయం చవిచూసింది. గురువారం జరిగిన అండర్-18 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో సాయి దేదీప్య 1-6, 6-0, 3-6తో మెహక్ జైన్ (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయింది. రెండో సెమీస్‌లో హర్షసాయి 6-1, 6-1తో నిఖిత పింటో (కర్ణాటక)పై అలవోక విజయం సాధించింది. శుక్రవారం జరిగే టైటిల్ పోరులో ఆమె... మెహక్ జైన్‌తో తలపడుతుంది. -
తుదిపోరుకు సాయి సంహిత
బెంగళూరు: ఏఐటీఏ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి సంహిత సత్తాచాటింది. ఇక్కడ జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ఆమె తుదిపోరుకు అర్హత సంపాదించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆమె 6-3తో క్వాలిఫయర్ రియా భాటియాపై సెట్ ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి గాయంతో వైదొలగింది. దీంతో సంహిత ముందంజ వేసింది. శనివారం జరిగే టైటిల్ పోరులో ఏపీ అమ్మాయి... మహారాష్ట్రకు చెందిన అద్న్యా నాయక్‌తో తలపడుతుంది. మరో సెమీస్‌లో అద్న్యా 6-1, 6-1తో సృ్మతి జూన్ (హర్యానా)పై విజయం సాధించింది.