తుదిపోరుకు సాయి సంహిత | Sai Samhitha took the lead | Sakshi
Sakshi News home page

తుదిపోరుకు సాయి సంహిత

Published Sat, Sep 14 2013 12:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

Sai Samhitha took the lead

 బెంగళూరు: ఏఐటీఏ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి సంహిత సత్తాచాటింది. ఇక్కడ జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో ఆమె తుదిపోరుకు అర్హత సంపాదించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆమె 6-3తో క్వాలిఫయర్ రియా భాటియాపై సెట్ ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి గాయంతో  వైదొలగింది.
 
 దీంతో సంహిత ముందంజ వేసింది. శనివారం జరిగే టైటిల్ పోరులో ఏపీ అమ్మాయి... మహారాష్ట్రకు చెందిన అద్న్యా నాయక్‌తో తలపడుతుంది. మరో సెమీస్‌లో అద్న్యా 6-1, 6-1తో సృ్మతి జూన్ (హర్యానా)పై విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement