తుదిపోరుకు సాయి సంహిత
బెంగళూరు: ఏఐటీఏ టెన్నిస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి సంహిత సత్తాచాటింది. ఇక్కడ జరుగుతున్న ఈ టోర్నమెంట్లో ఆమె తుదిపోరుకు అర్హత సంపాదించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆమె 6-3తో క్వాలిఫయర్ రియా భాటియాపై సెట్ ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి గాయంతో వైదొలగింది.
దీంతో సంహిత ముందంజ వేసింది. శనివారం జరిగే టైటిల్ పోరులో ఏపీ అమ్మాయి... మహారాష్ట్రకు చెందిన అద్న్యా నాయక్తో తలపడుతుంది. మరో సెమీస్లో అద్న్యా 6-1, 6-1తో సృ్మతి జూన్ (హర్యానా)పై విజయం సాధించింది.