ఫైనల్లో హర్షసాయి | harsha sai entered in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో హర్షసాయి

Published Fri, Jul 18 2014 1:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

harsha sai entered in finals

సాక్షి, హైదరాబాద్: ఎం.పి.ప్రకాశ్ స్మారక ఏఐటీఏ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన క్రీడాకారిణి చల్లా హర్షసాయి ఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో మరో తెలుగమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్లో పరాజయం చవిచూసింది.

గురువారం జరిగిన అండర్-18 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో సాయి దేదీప్య 1-6, 6-0, 3-6తో మెహక్ జైన్ (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయింది. రెండో సెమీస్‌లో హర్షసాయి 6-1, 6-1తో నిఖిత పింటో (కర్ణాటక)పై అలవోక విజయం సాధించింది. శుక్రవారం జరిగే టైటిల్ పోరులో ఆమె... మెహక్ జైన్‌తో తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement