క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్‌ | Sashank In Querters of Asian Tennis | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్‌

Apr 26 2019 3:18 PM | Updated on Apr 26 2019 3:18 PM

Sashank In Querters of Asian Tennis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా టెన్నిస్‌ టూర్‌ ఇంటర్నేషనల్‌ పురుషుల టోర్నమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుడు తీర్థ శశాంక్‌ నిలకడగా రాణిస్తున్నాడు. ముంబైలో జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో తీర్థ శశాంక్‌ (భారత్‌) 2–6, 6–2, 6–4తో ఐదో సీడ్‌ తేజస్‌ (భారత్‌)పై విజయం సాధించి ముందంజ వేశాడు.

తొలి సెట్‌లో వెనుకబడిన తీర్థ శశాంక్‌ రెండో సెట్‌లో పుంజుకొని సెట్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్‌లో పోటీ ఎదురైనప్పటికీ శశాంక్‌ 6–4తో సెట్‌ను గెలుచుకొని టైటిల్‌ రేసులో నిలిచాడు. మరోవైపు పట్లోళ్ల అపురూప్‌ రెడ్డి ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. ఎనిమిదో సీడ్‌ అపురూప్‌ 4–6, 1–6తో రాఘవ్‌ జైసింఘాని చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement