
పుణే: ఆసియా టెన్నిస్ టూర్ (ఏటీటీ) మహిళల ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మా యి నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిం ది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నిధి 6–1, 6–2తో హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది.
ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో చామర్తి సాయి సంహిత 6–1, 6–2తో అవిక సగ్వాల్‌పై, రియా 6–0, 6–0తో అలీకా ఇబ్రహీమ్‌పై, వన్షిత పథానియా 2–6, 6–3, 7–6 (7/5)తో ఆలియా ఇబ్రహీమ్‌పై, బేలా తమ్హాంకర్ 6–4, 6–3తో ఆర్తి ముణియన్‌పై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment