Asia Tennis Tour
-
ఆసియా టెన్నిస్ టోర్నీకి చాహన
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తోన్న హైదరాబాద్ ప్లేయర్ చాహన బుద్ధపాటి గొప్ప అవకాశాన్ని అందుకుంది. ఐటీఎఫ్ ఆసియా టెన్నిస్ అండర్–14 డెవలప్మెంట్ డివిజన్–1 చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు చాహన ఎంపికైంది. ఉజ్బెకిస్తాన్‌లో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ ఈనెల 19 వరకు జరుగుతుంది. ప్రస్తుతం ఆలిండియా అండర్–14 ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న చాహనతో పాటు పరీ సింగ్, సుహిత బాలికల జట్టుకు ఎంపికయ్యారు. బాలుర జట్టులో ఆయుష్మాన్, ఆగ్రేయ, యువన్ చోటుదక్కించుకున్నారు. -
క్వార్టర్ ఫైనల్లో నిధి
పుణే: ఆసియా టెన్నిస్ టూర్ (ఏటీటీ) మహిళల ర్యాంకింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మా యి నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిం ది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నిధి 6–1, 6–2తో హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో చామర్తి సాయి సంహిత 6–1, 6–2తో అవిక సగ్వాల్పై, రియా 6–0, 6–0తో అలీకా ఇబ్రహీమ్‌పై, వన్షిత పథానియా 2–6, 6–3, 7–6 (7/5)తో ఆలియా ఇబ్రహీమ్‌పై, బేలా తమ్హాంకర్ 6–4, 6–3తో ఆర్తి ముణియన్పై గెలుపొందారు.