
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తోన్న హైదరాబాద్ ప్లేయర్ చాహన బుద్ధపాటి గొప్ప అవకాశాన్ని అందుకుంది. ఐటీఎఫ్ ఆసియా టెన్నిస్ అండర్–14 డెవలప్‌మెంట్ డివిజన్–1 చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు చాహన ఎంపికైంది. ఉజ్బెకిస్తాన్‌లో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ ఈనెల 19 వరకు జరుగుతుంది.
ప్రస్తుతం ఆలిండియా అండర్–14 ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న చాహనతో పాటు పరీ సింగ్, సుహిత బాలికల జట్టుకు ఎంపికయ్యారు. బాలుర జట్టులో ఆయుష్మాన్, ఆగ్రేయ, యువన్ చోటుదక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment