nidhi chilumula
-
మెయిన్ ‘డ్రా’కు రష్మిక, నిధి, సాత్విక
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, నిధి చిలుముల, సామ సాత్విక... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రేయ తటవర్తి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక 6–1, 6–4తో హుమేరా బహార్మస్ (భారత్)పై, నిధి 4–6, 6–4, 10–6తో జెన్నిఫర్ ల్యుఖమ్ (భారత్)పై, సాత్విక 6–0, 6–1తో సౌమ్య (భారత్)పై, శ్రేయ 6–1, 6–2తో ఎలీనా (డెన్మార్క్)పై గెలిచారు. -
క్వార్టర్ ఫైనల్లో నిధి
పుణే: ఆసియా టెన్నిస్ టూర్ (ఏటీటీ) మహిళల ర్యాంకింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మా యి నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిం ది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నిధి 6–1, 6–2తో హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో చామర్తి సాయి సంహిత 6–1, 6–2తో అవిక సగ్వాల్పై, రియా 6–0, 6–0తో అలీకా ఇబ్రహీమ్‌పై, వన్షిత పథానియా 2–6, 6–3, 7–6 (7/5)తో ఆలియా ఇబ్రహీమ్‌పై, బేలా తమ్హాంకర్ 6–4, 6–3తో ఆర్తి ముణియన్పై గెలుపొందారు. -
నిధి, సౌజన్య ముందంజ
ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సంఘం (ఐటీఎఫ్) మహిళల చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 10 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నిధి 7-6 (7/5), 6-4 స్కోరుతో మన రాష్ట్రానికే చెందిన కాల్వ భువనపై విజయం సాధించింది. సానియామీర్జా టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నిధి, క్వార్టర్స్‌లో మూడో సీడ్ రిషిక సుంకరతో తలపడుతుంది. ప్రిక్వార్టర్స్‌లో రిషిక 6-2, 6-2తో అమృత ముఖర్జీని ఓడించింది. మరో ఏపీ అమ్మాయి సౌజన్య భవిషెట్టి కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్లో ఆమె 4-6, 6-2, 6-1 తేడాతో నాలుగో సీడ్ జపాన్ క్రీడాకారిణి ఎమి ముతగుచిని ఓడించింది. క్వార్టర్స్‌లో ఆమె రుతుజ భోంస్లేను ఎదుర్కొంటుంది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో అంకితా రాణాతో ప్రేరణ బాంబ్రీ, నటాషా పల్హాతో ప్రార్థన తోంబరే తలపడతారు. డబుల్స్‌లో ఏపీకి చెందిన సౌజన్య భవిషెట్టి జోడి క్వార్టర్స్‌కు చేరగా, అక్షర ఇస్కా-తీర్థ ఇస్కా జంటకు పరాజయం ఎదురైంది. సౌజన్య-షర్మద 6-0, 6-0తో ముతగుచి-నునోమె (జపాన్)ను చిత్తు చేయగా, శ్వేత రాణా-రిషిక సుంకర జంట 6-4, 6-1తో ఇస్కా అక్షర-ఇస్కా తీర్థలపై నెగ్గింది.